గొల్లపల్లి నేటి ధాత్రి:
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘసంస్కర్త, స్ఫూర్తి ప్రదాత సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కోమల్ల జలంధర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో విద్య నేర్చుకోవడం కొన్ని వర్గాలకే పరిమితం. సమాజంలో మూడ నమ్మకాలు, బాల్య వివాహాలు, అంటరానితనం, మహిళలు విద్యకు దూరం ఉండడం ఎక్కువగా ఉండేది వీటన్నిటి నిర్మూలనకు విద్య నేర్చుకోవడం ఒకటే మార్గమని మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు భావించి విద్య వ్యాప్తికి జీవితాంతం కృషి చేశారు. పూలే చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ సమాజ నిర్మాణంలో భవిష్యత్తు తరాలకు జ్యోతిరావు పూలే దంపతుల జీవిత చరిత్రలు తెలియజేయాలని ఆయన చేసిన కృషిని మరువ లేమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గోస్కుల జలంధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం యాదవ్, గొల్లపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ముదిరాజ్ సంఘం మండల గౌరవ అధ్యక్షులు, బి ఆర్ ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొండ్ల నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు కాసాని గంగాధర్, పట్టణ అధ్యక్షులు ఐతరవేనీ మల్లయ్య, చౌటపల్లి తిరుపతి, మ్యాదరి రమేష్, రత్నం, గంగాధర మధుసూదన్, నాగరాజ్, అజయ్, సాయి, సన్నీ, వర్ధన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.