వాహనాల తనిఖీలలో రూ.18.90 లక్షలు స్వాధీనం

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో దుగ్గొండి పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.దుగ్గొండి సీఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నర్సంపేట రూరల్ దుగ్గొండి సర్కిల్ పరిధిలో దుగ్గొండి మండలంలోని గిర్నిబావి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో టిఎస్ 04 ఈజెడ్ 6918 క్రెటా వాహనాన్ని అనుమానంతో తనిఖీలు చేపట్టగా వాహనంలో కన్నెటి ప్రభాకర్ రావు, లక్ష్మణ్ రావుల నుండి రూ. 15 లక్షల 60 వేలు,కంచర్లకుంట మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి నుండి 2 లక్షల రూపాయలు, మల్లాది రాంచేందర్ రెడ్డి అనే మరో వ్యక్తి నుండి రూ. 1 లక్ష 30 వేలు
మొత్తం రూ. 18 లక్షల 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కాగా వాహనాల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు ఉండడంతో నర్సంపేట ఏసిపి తిరుమల్ సమాచార మేరకు చేరుకొనే డబ్బు పట్ల పరిశీలించి విచారణ నిర్వహించారు.
భారీగా స్వాధీనం చేసుకున్న నగదును కొందరు రైతులు పండించిన మిర్చి కోల్డ్ స్టోర్ లో రైతులు దాచుకొని ఉంచగా ఆ మిర్చిని కొనుగోలు చేసేందుకు ఎనుకూరు మండల కేంద్రానికి చెందిన వ్యాపారులు ఖమ్మం వెళ్లి వస్తున్నారు.శనివారం లావాదేవీలు లేకపోవడంతో నగదును తీసుకుపోతున్నట్లు విచారణలో తేలినట్లు సీఐ పేర్కొన్నారు.నగదుకు సంబందించిన పూర్తి స్థాయి ధృవపత్రాలు లేకపోవడంతో రూ.18.90 లక్షలు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కిషన్ వివరించారు.ఈ తనిఖీల్లో దుగ్గొండి ఎస్సై పరమేష్ , సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *