
నేటిధాత్రి:హన్మకొండ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 65 రోజులు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు వారి కుటుంబాలు రోడ్లమీద పడేశారని తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ అన్నారు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే కనీసం వారిని పరామర్శించకపోవడం అదే కాకుండా ఆటో డ్రైవర్లు ఎవరు చనిపోలేదని అది ఉత్తుత్తేదే అని అవహేళన చేస్తున్నారు. తమరు ఒక పదవిలో ఉండి అలా మాట్లాడటం సరికాదు ఆటో డ్రైవర్లు ప్రభుత్వ సహకారం లేకుండా వారి సొంతంగా ఫైనాన్స్ ల ద్వారా ఆటోలను తీసుకొని కిరాయిలు లేకపోవడం వల్ల ఫైనాన్స్ లు కట్టలేక పిల్లల ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయినప్పటికీ స్పందన లేదు తక్షణమే జీవన మృతి కింద నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మడికొండ బాబు హన్మకొండ జిల్లా అధ్యక్షులు కాలకట్ల జయరాం, గుండా రమేష్ కందికొండ చక్రపాణి, సముద్రాల సాయిలు, పసునూరి బాబు, భీమారం దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.