
పంపిణీ కార్యక్రమంలో పాల్గోన్న స్థానిక కార్పొరేటర్
వరంగల్, నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో యాదవకాలనీలో మంగళవారం గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ హాజరయ్యారు. అనంతరం గొర్రెల యూనిట్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షకాలం దృష్టిలో పెట్టుకొని యాదవ సోదరులు జీవాలకు సోకే ఇన్ఫెక్షన్, అంటు రోగాలు సోకకుండా జాగ్రత్తపడాలి అని సూచించారు. జీవాలకు సంబంధించిన వ్యాధుల గురించి ధర్మారం వెటర్నరీ డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను పరిశీలించి రోడ్లు మరియు డ్రైనేజీ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను మరియు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, మున్సిపల్ ఎఇ కె కృష్ణమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ వేణు, మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ కొమ్ముల కిషోర్ కుమార్, లెంకలపెల్లి మల్లికార్జున్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన రవి యాదవ్, జక్కుల రాజుయాదవ్, గంగుల నాగరాజు, వెటర్నరీ డాక్టర్లు మరియు సిబ్బంది, శానిటరీ జవాన్ విష్ణు, స్థానిక భారాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.