Vande Mataram 150-Year Celebrations in Parakal
ఘనంగా వందేమాతరం 150 యేండ్ల వేడుకలు
గీతాలాపనలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు
పరకాల,నేటిధాత్రి
వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా
భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో పట్టణానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని పూర్తి వందేమాతరం గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ రావు,బిజెపి రాష్ట్ర నాయకులు సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వందేమాతరం పూర్తి ఆరు చరణాలతో గానం చేయాలని మరియు ప్రతి భారతీయుడు వందేమాతరం గర్వంగా పాడాలని,అలాగే వందేమాతరం గీతంతోనే స్వతంత్ర పోరాటం ఉవ్వెత్తున కొనసాగింది అని అన్నారు. కాంగ్రెస్ మైనార్టీల ప్రసన్నత కోసం వందేమాతరంలోని దేవి దుర్గమ్మ భరతమాత అంశాలు ఉన్న చరణాలను

తొలగించాలని తెలిపారు.ఇప్పుడు ప్రతి భారతీయుడు వందేమాతరం యొక్క అర్థం చేసుకొని గర్వపడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాచం గురుప్రసాద్,ఆర్ పి జయంతి లాల్,చందుపట్ల రాజేందర్రెడ్డి, బెజ్జంకి పూర్ణ చారి,ఎర్రం రామన్న,మేకల రాజవీరు, ప్రధాన కార్యదర్శిలు సంఘ పురుషోత్తం,పాలకుర్తి తిరుపతి,బిజెపి జిల్లా నాయకులు కుక్కల విజయ్ కుమార్,మార్త బిక్షపతి,మార్త రాజభద్రయ్య,భాస్కరాచారి, దంతనాల సత్యం,పావుశెట్టి శ్రీనివాస్,కానుగుల గోపీనాథ్, ముత్యాల దేవేందర్,ఆకుల శ్రీధర్,ధర్నా సునీల్,దామ సతీష్,సంఘ నరేష్, మరాటి నర్సింగరావు,ఆకుల రాజేందర్,సారంగ నరేష్, దంతనాల కిరణ్,మై భారత్ ఇన్చార్జ్ వావిలాల వెంకటరమణ,బల్స గురి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
