# బిఆర్ఎస్ పార్టీలో అవిశ్వాస తీర్మాన చిచ్చు..
# మాజీ ఎమ్మెల్యే పెద్ది వైఖరి నచ్చక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన.
# విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్,కౌన్సిలర్స్
నర్సంపేట నేటిధాత్రి :
నర్సంపేట పురపాలక సంఘం అవిశ్వాస తీర్మానం బిఆర్‌ఎస్ పార్టీలో చిచ్చు పెట్టింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్
పార్టీకి 14 మంది రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి తో పాటు మరో 13 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకు గాను ఈనెల 2న అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అవిశ్వాసం కోసం బలనిరూపణ చేయాల్సి ఉండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో తమకు అనుకూలంగానే ఉంటుందని నచ్చజెప్పి పార్టీ విప్ పైన సంతకాలు తీసుకున్నారని అలాగే మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో మిగతా కౌన్సిలర్స్ అవిశ్వాసం సమయానికి రప్పిస్తానని మాట ఇచ్చారని ఆరోపించారు.అందుకే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చకనే రాజీనామా చేసినట్లు తెలిపారు.కౌన్సిలర్ గా ఉన్న మేము మా పదవులకు రాజీనామాలు చేయడం పట్ల మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ ద్వారా హై కమాండ్ కు లేఖలు పంపిస్థున్నట్లు తెలిపారు.రాజీనామా చేసిన వారిలో వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,కౌన్సిలర్స్ నాగిశెట్టీ పద్మ ప్రసాద్,గంప సునీత రఘునాథ్ గౌడ్,రుద్ర మల్లీశ్వరి ఓం ప్రకాష్,వెల్పుగొండ పద్మరాజు, గందె రజిత చంద్రమౌళి,రమసహాయం శ్రీదేవి, దేవోజు తిరుమల సదానందం,కవిత,బానాల ఇందిరా, జుర్రు రాజు,మినుముల రాజు,శీలం రాంబాబు గౌడ్, బోడ గోల్యా నాయక్ ఉన్నారు.