*ఒకే ఇంట్లో సుమారు నూట ముప్పై క్వింటాళ్లకు పైగా బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం*
*లేక్కింపు చేపడుతున్న అధికారులు*

గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగరావుపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం నిల్వ చేశారన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. రంగరావుపల్లి గ్రామంలోని సందనవేని గట్టయ్యకు చెందిన ఇంట్లో పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అధికారులు దాడులు చేపట్టారు. తెలిసిన వివరాల ప్రకారం గట్టయ్య ఇల్లు ఖాళీగా ఉండడంతో నెల క్రితం రమేష్ అనే వ్యక్తి అద్దెకి తీసుకొని బియ్యం నిల్వలు కోనసాగిస్తున్నాడన్నా పూర్తి సమాచారంతో అధికారులు ఇంటిపై దాడి చేసి భారీ మొత్తంలో నాలుగు గదులలో నిల్వచేసిన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకోని, పట్టుకున్న బియ్యం రేషన్ బియ్యమా లేదా పంట బియ్యమా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని, అయితే ఇప్పటికే ఒక డీసీఎం వాహనంతో పాటు ఇంకొక్క గూడ్స్ వాహనంలో బియ్యం నింపి తరలించినట్లు, పట్టుకున్న బియ్యం సుమారుగా వంద నుండి నూట ముప్పై క్వింటాళ్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని, ఇంకా లెక్కింపు కోనసాగుతుందని, లెక్కింపు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈసోదాల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బి. ప్రశాంత్ రావు, డి.వరుణ్ ప్రసాద్, సివిల్ సప్లైస్ & ఎన్ఫోర్స్మెంట్ డి.టి. డి. ఉషారాణి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

