
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జన సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి సందర్భంగా మండల కోఆర్డినేటర్ నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత కోసం తన జీవితమంతా అంకితం చేసిన ఆదర్శ వ్యక్తి హిందూ జాతీయ వాదమే లక్ష్యంగా జనసంఘ్ పార్టీని స్థాపించి అఖండ భారత నిర్మాణం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నతమైన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ, దేశంలోని పౌరులందరికీ ఇతని ఆదర్శం గా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మెర్చజిల్లా ఉపాధ్య క్షులు ఉప్పు రాజు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెళ్లి శ్రీకాంత్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకుడు బాసని విద్యాసాగర్ వనం దేవరాజ్ భూత్ అధ్యక్షులు కోమటి రాజ శేఖర్ పాల్గొన్నారు.