Demand for 12% Reservation for Minorities in Telangana
మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.
