మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాతాల రాజు భవన్ లో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు మేము వ్యతిరేకం కాము కానీ 1994 ముందు రాష్ట్రంలో అప్పుడు ఉన్న జనాభా మాదిగలు 7 శాతం రాష్ట్రంలో కానీ ఇప్పుడు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది అని వారు అన్నారు దేశంలోని 29 రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చారు కావున తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది మాదిగల జనాభా ప్రకారం విభజన చేసి ఏ జిల్లాలో ఎంతమంది మాదిగల ఉన్నారు అనే దానిని బట్టి రిజర్వేషన్లు అమలు చేయాలి రాష్ట్రంలో మాదిగలు జనాభా 100 కు 80 శాతం మాదిగలు ఉంటే మాలలు 100కు 20 శాతం మంది మాలలు ఉంటారు కావున ఏ జిల్లాల ఎంత మంది మాదిగలు ఎంతమంది మాలలు ఉన్నారు అని లెక్కలు తీసి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 52 కులాలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణను అమలు చేయాలని కోరుతున్నాము వర్గీకరణ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది కావున మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని హైదరాబాదులో వర్గీకరణ సభ పెట్టబోతున్నమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు ఈ కార్యక్రమంలో మైస ఉపేందర్ వీరేందర్ కిషోర్ శ్రీకాంత్ రవీందర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు