సరిహద్దు మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ 12 మావోయిస్టుల మృతి.

భారీగా ఆటోమేటిక్ నూతన సాంకేతిక ఆయుధాలు స్వాధీనం.

దళం ఇన్చార్జి తోపాటు మరొక అగ్రనేత మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు.

మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన ఎదురుకాల్పులు.

సి సిక్స్టీ బెటాలియన్ ఎస్సై ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలు, చికిత్స కోసం నాగపూర్ తరలింపు.

ఎన్కౌంటర్ ప్రదేశంలో కొనసాగుతున్న సోదాలు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర గడుచురల్లీ జిల్లా వడోలి ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామం అడవుల్లో మావోయిస్టులు క్యాంపింగ్ లో ఉన్నట్లు విశ్వనీయ సమాచారంతో డిప్యూటీ ఎస్పీ ఆపరేషన్ నేతృత్వంలో 7C60, బెటాలియన్లు రంగంలోకి దిగడంతో బాబు ఈస్ట్ మరియు పోలీసుల మధ్య భీకర పోరు మధ్యాహ్నం ఒకటింటికి మొదలు కావడంతో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. పోలీస్ మరియు మావోయిస్టుల మధ్య సాయంత్రం 6 గంటల వరకు ఎదురు కాల్పులు ఆపకుండా కొనసాగడం జరిగిందని, ఇంకా పోలీసులు సోదాలు నిర్వహించడం జరుగుతున్నట్లు సమాచారం. బాబు ఈస్ట్ కాల్పుల్లో సి 60 బెటాలియన్ కు చెందిన ఒక ఎస్సై తో పాటు జవాన్ కు బుల్లెట్ గాయాలు కావడంతో వారికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నాగపూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్కౌంటర్ ప్రదేశం నుండి, నూతన సాంకేతిక ఆయుధాల్లో ఒకటైన INSAS1 కార్బన్, తో పాటు, మూడు ఏకే 47 ఒకటి ఎస్ ఎల్ ఆర్ తో సహా ఏడు ఆటోమేటివ్ ఆయుధాలు ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులకు కాల్పుల్లో మృతి చెందిన 12 మావోయిస్టుల్లో తిప్పగడ్డ దళం ఇన్చార్జి టీవీ సిఎం లక్ష్మణ్ ఆత్రం, విశాల్ ఆత్రం గా ఒకరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరిన్ని బావోయిస్టులు ఎన్కౌంటర్ ప్రదేశ ప్రాంతంలో ఉన్నారా అని కోణంపై పోలీసులు సోదరులను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!