ఈనెల 11 మాదిగల విశ్వరూప మహాసభ

భూపాలపల్లి నేటిధాత్రి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలో సంఘమిత్ర డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ కరపత్రాలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దోర్నాల రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేసిన అనంతరం సందే కార్తిక్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 29 సంవత్సరాలుగా ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని గత తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం బిజెపి పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగిందని అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ పై జాప్యం చేస్తూనే వస్తుంది బిజెపి పెద్దలు కృష్ణ మాదిగ ఎప్పుడు సభలు పెట్టిన హాజరై వర్గీకరణకు మేము అనుకూలమంటూ మాట ఇస్తూనే వస్తున్నారని ఈనెల 11న మాదిగల విశ్వరూపం మహాసభ నిర్వహించబోతున్నారని ఈ సభకు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీని తీసుకురాబోతున్నారని అందుకోసం మాదిగల ఆవేదన మాదిగల బలాన్ని మన సత్తా ఏంటో ఈ నెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చూపించాలని అందుకోసం జిల్లాలోని ప్రతి మాదిగ విద్యార్థులు సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని సందే కార్తిక్ మాదిగ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ ఎం వై ఎస్ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు దోర్నాల భారత్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రేనుకుంట్ల రాజకుమార్ విద్యార్థులు మల్యాల స్రవంతి రోట్ల అభి గయాల్ తోటపల్లి స్రవంతి దాసరి నవీన మేకల మిర్యామి రేణిగుంట్ల శ్రావణి మోరే కిరణ్ పొన్నల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *