
11 కేవీ తెగిపడి
గొర్రెల దొడ్డి దగ్ధం
18గొర్రెలు మృతి 20 గొర్రెలు అస్వస్థత
కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న లక్ష్మి కుటుంబ సభ్యులు
#నెక్కొండ, నేటి ధాత్రి :
మండలంలోని పెద్ద కోర్పోల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్ద కొర్పోల్ గ్రామంలోని 11 కె.వి విద్యుత్ వైర్ ఇన్సులేటర్ ఫెయిల్ కావడంతో నూకల లక్ష్మి గొర్రెల షెడ్డు పై పడడంతో షార్ట్ సర్క్యూట్ తో 18 గొర్రెలు మృతి చెందగా 20 గొర్రెలు అస్తవ్యస్తతకు గురైనట్లు గొర్రెల యజమాని నూకల లక్ష్మి తెలిపారు. ఈ ప్రమాదం విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యం ద్వారానే సంభవించినట్లు పలువురు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ కు సంబంధించిన అధికారులకు పలుమార్లు లెవెన్ కె.వి లైన్ తొలగించాలని కోరిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని లక్ష్మి కుటుంబ సభ్యులు బోరును విలపించారు. చనిపోయిన గొర్రెల విలువ సుమారు నాలుగు లక్షల వరకు ఉంటుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మి అన్నారు.