
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉన్న తేదీని మే 10 వ తేదీ వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ నియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పి ఎస్ ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూతులో విధులు కేటయించిన సిబ్బంది 10 వ తేదీ వరకు కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పటి లాగే ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బాలేట్ వినియోగానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కోవాలని అన్నారు. అధికారులు సిబ్బంది పోస్టల్ బాలెట్ వినియోగంపై ఫోకస్ చేయాలని ఆయన పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఉల్లంఘన జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951,
u/s 134 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోస్టల్ బాలేట్ కేంద్రంలోని హెల్ప్ డెస్క్, విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంగం ఉత్తర్వులు మేరకు యథా విధిగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.