పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

ఈ నెల18 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో 10వ తరగతి
పరీక్షలు నిర్బహణపై ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ
జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాలలో 11 మండలాలకు చెందిన 3,547 మంది విద్యార్థులు
పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షలు ఉదయం.9:30 నుండి మద్యాహ్నం12:30 వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్దులను ఒక గంట ముందు నుండే పరీక్షా కేంద్రానలకు అనుమతిస్తారని, చివరి నిమిషం వరకు వేచియుండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై సంబంధించిన అధికారులు ధ్రువీకరణ నివేదికలు అందచేయాలని తెలిపారు.
20 పరీక్షా కేంద్రాలకు గాను 20 మంది చీఫ్ సూప రింటెండెంట్లు, 20 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 20 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని అలాగే 200 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలలో విధులు నిర్వహించనున్నారని చెప్పారు. ముగ్గురు సెంటర్ కస్టోడియన్లు, ఇద్దరు రూట్ ఆఫీసర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 10 వర తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ప్రారంభం నుండి ముగిసే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరీక్షకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలు అందజేయాలని చెప్పారు. ప్రశ్న, జవాబు పత్రాలను ద్విచక్ర వాహనాలలో కాకుండా
క్లోజ్డ్ వాహనాలలో భద్రత నడుమ తరలించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరాయ విద్యుత్ సరఫరా, సురక్షిత మంచినీరు ,అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేపించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి సైతం సెల్ ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యూలేటర్ తీసుకెళ్లడానికి అనుమతి లేనందున నిశిత పరిశీలన తదుపరి మాత్రమే ఇన్విజిలేటర్ లను, విద్యార్థులను పరీక్ష కేంద్రాల లోపలికి అనింతించాలని చెప్పారు. తనిఖీకి వచ్చే అధికారులను సైతం సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల లోపలికి సెల్ఫోన్లను అనుమతించడం వల్ల ఫోటో తీసి ప్రశ్నపత్రాలను లీక్ చేసే అవకాశం ఉంటుందని తద్వారా ఎందరో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు పాటించాల్సిన నియమ, నిబంధనల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ముందస్తు ఏర్పాట్లు పరిశీలన తర్వాత ఇన్విజిలేటర్ ధ్రువీకరణ పత్రం అందజేయాలని తెలిపారు.
బెంచీలు,ఫ్యాన్లు,లైట్లు అందుబాటులో ఉంచాలని ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని ఏదైనా సమస్య ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని
చిన్న, పెద్ద సమస్య అయినా సంబంధిత గ్రూపులో పోస్ట్ చేయాలని ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అదనపు బస్సులు ఏర్పాటుచేసి పరీక్షలు రాసే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంచాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్షల ప్రశాంతంగా పకడ్బంధిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పరీక్షలు నిర్వహణలో ఇన్విజిలేటర్లు సీ.ఎస్ లయొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనదని సి.ఎస్ లు మినిట్ టూ మినిట్స్ లాక్ బుక్కు నమోదు చేయాలని
జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
జిల్లా విద్యాశాఖ అధికారి రాం కుమార్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఎంఈఓ లు ఏ.ఎం.ఓ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *