నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కమలాపూర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి108, 102 అంబులెన్స్ లను ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని పరికరాలు,రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమములో పైలట్ కేదారి,ఈఎంటి ఉపేందర్, కెప్టెన్ తిరుపతి పాల్గొన్నారు.