
108 vehicle..
108 వాహనంలో ప్రసవం,,,, డెలివరీ కండక్ట్ చేసిన 108 సిబ్బంది,,,,
◆:-పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
108 అత్యవసర అంబులెన్స్ వాహనంలో సోమవారం రాత్రి పందంటి అడబిడ్డకు జన్మనిచ్చిన ఝరాసంగం మండలంలోని రాంచందర్ నాయక్ తండా గ్రామ పరిధిలో జరిగిందని 108 సిబ్బంది డెలివరీ కండక్ట్ చేసి సురక్షితంగా బిడ్డను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఈపంటి సంగమేశ్వర్, పైలట్ సాగర్ తెలిపారు. 108 ఇబ్బంది కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలంలోని రాంచందర్ నాయక్ తండా గ్రామానికి చెందిన బానోత్ సుజాత పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 నెంబర్ కి ఫోన్ చేశారు. 108 ఉన్నత సిబ్బంది స్థానిక ఝరాసంగం మండల 108 అంబులెన్స్ కు కాల్ కనెక్ట్ చేసి సిబ్బంది సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి సంగమేశ్వర్ పైలెట్ సాగర్ లు వెంటనే 108 వాహనం తీసుకొని గ్రామానికి చేరుకొని పురిటి నొప్పులతో బాధపడుతున్న సుజాత అంబులెన్స్ లో తీసుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళు సంఘటనండగా మార్గమధ్యలో గ్రామ సరిహద్దు దాటిన వెంటనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ఈఎంటి సంగమేశ్వర్ 108 అంబులెన్స్ వాహనం లోనే డెలివరీ కండక్ట్ చేశారు. సుజాత అడబెద్దకు జన్మనిచ్చారు. డెలివరీ పూర్తి చేసిన ఈఎంటి సంగమేశ్వర్ శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించారు. నార్మల్ డెలివరీ కండక్ట్ చేసినందుకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ 108 సిబ్బంది ఈఎంటి సంగమేశ్వర్ కు, పైలట్ సాగర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, వాహనంలో సుజాత తో పాటు వారి తల్లి గ్రామ ఆశ కార్యకర్త ఉన్నారు. అనంతరం తల్లిని బిడ్డను ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, తల్లిని బిడ్డను చూసిన డాక్టర్లు తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.