1000 రోజులుగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు మరియు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు

వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజన్న ఆలయం వద్ద 500 మందికి స్వీట్ల తో పాటు అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు రాజు మాధవి డాక్టర్ పంతగాని శోభారాణి డాక్టర్ కల్లెపెల్లి అక్షిత

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ నేటి ధాత్రి

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకారంతో నేటికి వెయ్యి రోజులుగా అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి గారిచే కేక్ కట్ చేయించి రాజన్న ఆలయం వద్ద 500 మందికి అన్నదానం స్విట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా గత కోవిడ్ నుండి అన్నదాన సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఇట్టి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న దాతలందరికీ, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్న సభ్యలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని అన్నారు

డాక్టర్ పంతగాని శోభారాణి, డాక్టర్ కల్లెపెల్లి అక్షత మాట్లాడుతూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మేము ఎక్కడ చూడలేదని, అన్నదానం అనేది ఒక గొప్ప కార్యక్రమాని ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ట్రస్టు వారికి ఋణపడి ఉంటామని మావంతు సహాయ, సహకారాలు ఎల్లవేళలా వుంటాయని అన్నారు.

నేటి అన్నదాతలుగా నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, సిరి హాస్పిటల్ సిరిసిల్ల వాస్తవ్యులు పంతగాని శోభారాణి పెంచలయ్య దంపతులు, అమృత నర్సింగ్ హోమ్ డాక్టర్. ముస్కు ఆనందరెడ్డి మల్లేశ్వరి దంపతులు, మారం ప్రశాంత్ సౌజన్య దంపతులు, రాపెల్లి లావణ్య శ్రీధర్ దంపతులు, తోట లహరి రాజేష్ దంపతులు, బ్రహ్మన్నగారి రమేష్ శర్మ రాధ దంపతులు, బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శర్మ అరుణ దంపతులు, బీరెడ్డి ఆరోగ్యరెడ్డి విమలజ్యోతి దంపతులు, తోట రమేష్ కల్పన దంపతులు, ప్రతాప నటరాజు చందన దంపతులు, గుండ అశోక్ దంపతులు, భస్మాంగి బస్వరాజు విధ్యారాణి దంపతులు, పల్లెర్ల వసంత భూమయ్య దంపతులు, పల్లెర్ల భాగ్యలక్ష్మి భూపతి దంపతులు, నక్క నర్సవ్వ మరియూ వీరి కుటుంబ సభ్యులు, సిద్దిపేట వాస్తవ్యులు శివ్వ శ్రీలత శివకుమార్ దంపతులు, కూరగాయల కరుణాకర్ అనిత దంపతులు, సిరిసిల్ల వాస్తవ్యులు కూరపాటి రేఖ శ్రీధర్ దంపతులు,సిరిసిల్ల వాస్తవ్యులు అక్షిత కేరళ ఆయుర్వేదిక్ క్లినిక్ డాక్టర్. కల్లెపెల్లి అక్షత శ్రీధర్ దంపతులు, గుమ్మడి శ్రీనివాస్ రజిత దంపతులు, కాంచనపల్లి అనిత రఘురాజు దంపతులు, చెన్నమనేని సత్యనారాయణ రావు దంపతులు, గుంటి శ్రీనివాస్ గార్లు వున్నారు.

ఇట్టి కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు, ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నేరెళ్ల తిరుమల గౌడ్, నగుబోతు రవీందర్, గొంగళ్ళ రవికుమార్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, బస్మంగి బసవరాజు తాళ్లపల్లి ప్రశాంత్, వొడ్యాల వేణు, ప్రతాప సంతోష్, ప్రతాప నటరాజు, కళా అశోక్, పొలాస రాజేందర్, గొండ ప్రసాద్, సగ్గు దేవరాజు, కొప్పుల హనుమాన్, గుండర్స్ మాధవ్, గొంగళ్ళ శ్రీదేవి, చల్ల సత్తయ్య, తోట లహరి, ప్రతాప చందన, వీరగోని ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!