మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం.

వెల్దండ / నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బిసనమోని శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందాడు. మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐజాక్, ప్రభాకర్, చంద్రమోహన్ రెడ్డి, జంగయ్య, వెంకటయ్య, నాగయ్య, తిరుపతిరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!