పరకాల నేటిధాత్రి(టౌన్)
ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహలక్ష్మి దరఖాస్తుల స్వికరణ కార్యక్రమం లో భాగంగా ఈరోజు పరకాల మున్సిపాలిటీ కార్యాలయం లో గృహలక్ష్మి దరఖాస్తుల కౌంటర్ లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ టీ. శేషు,చైర్ పర్సన్ మాట్లాడుతూ పరకాల పట్టణంలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి గృహలక్ష్మీ పథకం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈరోజు నుంచి 10వ తేదీ సాయంత్రం 5:00గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అలాగే పరకాల పట్టణంలో ఉన్న అన్ని కులాల లబ్ధిదారులందరూ కూడా సంబంధించిన డాక్యుమెంట్లు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు,తప్పనిసరిగా ఆధార్ కార్డు-రేషన్ కార్డు-బ్యాంక్ అకౌంట్-స్థలానికి సంబంధించిన పేపర్స్,కులం సర్టిఫికెట్ పాతవి ఉన్నా కూడా దరఖాస్తుకు జిరాక్స్ లు జతపరిచి మున్సిపాలిటీలో ఇవ్వగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఒంటేరు సారయ్య,ఏకు రాజు, మున్సిపాలిటీ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ గిరిబాబు, శ్రీను, కృష్ణంరాజు, శ్రీనివాస్,స్రవంతి తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.