హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (AGP)గా మన ములుగుజిల్లా వాసి

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది(AGP)గా ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ వాస్తవ్యులు మేకల గౌతమ్ కుమార్ గారు నియామకం అయ్యారు. వీరిని ప్రభుత్వం హోం శాఖ న్యాయ వ్యవహారాల్లో AGPగా నియమించింది. పేద దళిత కుటుంబంలో పుట్టి బాల్యం నుంచి చదువుల్లో చురుకుగా ఉండే గౌతమ్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2007 నుండి 2012 వరకు న్యాయశాస్త్రంలో LLB మరియు మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాలో విద్యార్థి సంఘం నాయకుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు. హైకోర్టులో న్యాయవాదిగా అనేక మంది ప్రశంసలు పొందారు. గౌతమ్ కుమార్ సేవలను, కృషిని గుర్తించిన ప్రభుత్వం హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది(AGP)గా నియమించింది. AGPగా గౌతమ్ కుమార్ నియామకం సందర్భంగా ములుగు జిల్లా ప్రజలు, ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు,మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా AGP మేకల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నా తల్లిదండ్రులు ఎంతో పేదరికాన్ని అనుభవించి కష్టపడి చదివించడం ద్వారా నేను ఈ స్థాయికి వచ్చానని నా తల్లిదండ్రుల రుణం ఎప్పటికి తీర్చుకోలేనని అన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులకు ప్రణామములు తెలుపుతూ అభినందించిన గ్రామస్థులకు, పెద్దలకు, బంధుమిత్రులకు, జిల్లావాసులకు, శ్రేయోభిలాషులకు, ఉస్మానియా విద్యార్థిలోకానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ న్యాయం, ధర్మం కోసం తను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *