హస్తంలో విజయ రెడ్డి కారులో గోవర్ధన్ రెడ్డి

దానం అడిగాడు! రేవంత్‌ కాదన్నాడు!?

పట్టుపట్టి పదిమందితో చెప్పించాలని చూసినా లేదన్నాడు?

పాత గ్రూపులు పోగేసుకొని మరీ దానం అడిగినట్లున్నాడు?

రేవంత్‌ వెంటనే విజయా రెడ్డిని రంగంలోకి దింపాడు?

పైలా పచ్చీస్‌ మొదలుపెట్టాడు?

దానంను గాంధీభవన్‌ మెట్లెక్కుండా చేశాడు?

నిన్నటి దాకా అందరినీ చిర్రుబుర్రులాడే దానం కార్యకర్తలను కౌగిలించుకుంటున్నాడు!

ముసి ముసి నవ్వులతో మచ్చటపెడుతున్నాడు?

వచ్చిన నాయకులకు మర్యాదలు చేస్తున్నాడు?

ఆ నోట, ఈ నోట ఈ సంగతి తెలిసి దానంకు కారులో చోటు లేదన్నట్లున్నారు?

అత్యాశ ఇప్పటికే ఓసారి కొంపముంచింది…ఇప్పుడు మరో సారి నిజం కానున్నది?

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…?

హస్తంలో విజయా రెడ్డి, కారులో గోవర్ధన్‌ రెడ్డి! ఇది ఫిక్స్‌!?

ఆగం కానున్న దానం రాజకీయం..!

కారులో కుదురుగా కూర్చోలేదు?

గతంలో చేజేతులా చెడగొట్టుకున్నాడు…?

పదవులు శాశ్వతం అనుకొని, రాజకీయం తాత్కాలికం చేసుకున్నాడు?

రాజకీయాలలో అంతే…అంతే!!     

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవడానికి పేకాట కాదు…పోయినచోట వెతుక్కోవడానికి వస్తువు కాదు….రాజకీయం…విశ్వాసం..నమ్మకం…ప్రజల ఆశీర్వాదం….ఏ ఎండకాగొడుగు పట్టడం, తన రాజకీయం జీవితం పబ్బం గడుపుకోవడం దానం నాగేందర్‌కు కొత్త కాదు…దానం రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయం…ఎప్పుడు ఎక్కడ వుంటాడో తెలియని రాజకీయం….దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌లో ఇమడ లేక, కష్టంగానే సాగుతున్నాడు అనేది చాలా మంది చెబుతున్న మాటే కాకపోతే 2014 ఎన్నికల్లో ఓటిపోయిన తర్వాత అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని టిఆర్‌ఎస్‌లో చేరాడు. పార్టీలు జంప్‌ కావడం అన్నది దానంకు అనాదిగా వస్తున్నదే…టిఆర్‌ఎస్‌లోకి రానైతే వచ్చాడు కాని, ఆయన టిఆర్‌ఎస్‌ శ్రేణులతో మమేకమైపోలేదు. నాయకులను పట్టించుకోలేదు. కార్యకర్తలను దరి చేరనీయలేదు. ఇక కరోనా కాలంలో ప్రజలకు అందుబాటులో వున్న దాఖలాలు పెద్దగా లేవు. దాంతో ఆయన ఇక టిఆర్‌ఎస్‌లో వున్నా, భవిష్యత్తు నీలి నీడలే కళ్లముందు కనిపిస్తున్నాయనుకున్నట్లనుకున్నాడు…దాంతో మళ్లీ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోవాలని చూసినట్లు విశ్వసనీయ సమచారం. కాని డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఒక నాడు పిజేఆర్‌ అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దానం, ఆయన చలవ వల్ల రెండుసార్లు ఆసిఫ్‌నగర్‌ నుంచి గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దానం నాగేందర్‌కు టిక్కెట్‌ నిరాకరించింది.ఆఖరు సమయం వరకు వేచి చూసిన దానం, రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కండువా వదిలేసి, తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఆసిఫ్‌ నగర్‌ నుంచి టిడిపి బిఫామ్‌ తెచ్చుకున్నాడు. గెలిచారు. కాని తెలుగుదేశం ఓడిపోయింది. కాంగ్రెస్‌ విజయం సాధించింది.

వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో వెంటనే మళ్లీ తెలుగుదేశం కండువా వదిలేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. అక్కున చేర్చుకొని, రాత్రికి రాత్రి చేరినా టిక్కెట్టు ఇచ్చి నమ్మిన చంద్రబాబును మోసం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానంటే రేవంత్‌ రెడ్డి ఆహ్వానిస్తాడా? ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు అనుచరుడే…అలాంటిది దానంను దరి చేరనిస్తాడా? ఎలాగైనా దానం కాంగ్రెస్‌లో చేరేందుకు చేయాల్సినంత ప్రయత్నం చేసినట్లే తెలుస్తోంది. కాంగ్రెస్‌ లోని సీనియర్లతో కూడా రేవంత్‌కు చెప్పి చూసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా దానంను గాంధీభవన్‌ మెట్లెక్కకుండా చేయాలి. అందుకు రేవంత్‌ రెడ్డి వెంటనే పిజేఆర్‌ కుటుంబాన్ని మళ్లీ క్రియాశీలకం చేయాలనుకున్నాడు. కార్పోరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి, ఖైతరాబాద్‌ టిక్కెట్‌ నీకే అన్నాడు. దానం ఆశలను ఆదిలోచే రేవంత్‌ తుంచేశాడు. ఈ విషయం ఆనోట, ఈ నోట కారు టిఆర్‌ఎస్‌ పెద్దల చెవిన పడిరది. టిఆర్‌ఎస్‌లోనూ దానం విషయంలో పార్టీ పునపరిశీలన చేయాలన్నంతా దాకా వచ్చింది. దాంతో అన్ని వైపులా దారులు మూసుకుపోయిన దానం నాగేందర్‌ కు ఎటూ పాలుపోని స్ధితిలోకి నేట్టేసినట్లైంది. నిన్నటిదాకా కార్యకర్తలను చూస్తేనే చిర్రుబుర్రులాడే దానం వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. అక్కున చేర్చుకుంటున్నాడు. ఆలింగనం చేసుకుంటున్నాడు. మర్యాదలు కూడా చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. ముసిముసి నవ్వులతో కార్యకర్తలతో ముచ్చటపెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. 

దానం ఎక్కడ వుంటే అక్కడ విచిత్రంగా హడావుడి వుండేది. సందర్భమేదైనా, సరే హడావుడికి కొదువుండేది కాదు… వైఎస్‌ మరణంతో ఇక ఆయన జగన్‌ను ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో క్యాంపు కార్యాలయం కేంద్రంగా దానం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు…ఇక జగన్‌ తర్వాత నేనే అన్నంత హంగామా సృష్టించాడు. కాని జగన్‌కు ముఖ్యమంత్రి రావడం లేదని తెలిసిన మరుక్షణం జగన్‌కు జెల్లకొట్టాడు. జగన్‌కు అనుకూలంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దానం దూరం జరిగాడు. రోశయ్య మంత్రి వర్గంలో చేరాడు…ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో దానం చేసిన హాడావుడి చెప్పనలవి కాదు…నగరం మొత్తం కిరణ్‌కుమార్‌రెడ్డి హోర్డింగులతో నింపేశాడు. రాజ్‌భవన్‌ దారిలో దానం నాగేందర్‌, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్ర తరమైన సందర్భంలో , శ్రీకృష్ణ కమిటి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన సమయంలోనూ హైదరాబాద్‌ నాదీ అన్నంత హంగామా చేశాడు. హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాడు. ఒక దశలో ఉద్యమ కారుల మీద సికింద్రాబాద్‌లో స్వయంగా ఆయనే పోలీసు లాఠీ పట్టుకొని వీర విహారం చేశాడు. తెలంగాణ విద్యార్థులను చెల్లాచెదురు చేశాడు. 

తన కోసం ఎంతకైనా దిగజారడతాడని , తనకు సాయం చేసిన వారిని రాజకీయంగా నిండా ముంచడానికి ఏనాడు వెనుకాడడని చెప్పడానికి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు.2009 డిలిమిటేషన్‌ కారణంగా ఖైరతాబాద్‌ను రెండు ముక్కలు చేయడంతో కీలకపాత్ర పోషించిన దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి, 2009 ఎన్నికల్లో పి. విష్ణువర్ధన్‌రెడ్డికి ఖైరతాబాద్‌ కేటాయించకుండా, దానం నాగేందర్‌కు ఇచ్చారు. అలా తనను రాజకీయ గురువైన పిజేఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేయడానికి పూనుకున్నాడు. తప్పని పరిస్ధితులత్లో విష్ణు జూబ్లిహిల్స్‌ నుంచి పోటీ చేయకతప్పలేదు. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయిన దానం, టిఆర్‌ఎస్‌ దరి చేరారు. కారులో చోటు సంపాదించుకున్నాడు. మళ్లీ ఖైతరాబాద్‌ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. కాని ఆనాటి నుంచి ఆయన జనంలో వున్నట్లు పెద్దగా కనిపించలేదు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను అనేక సందర్భాలలో చిన్న చూపు చూడడం, వారిని ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా వివాదాలున్నాయి. పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పార్టీపరమైన రాజకీయాల గోడ దూకడంలో ఆరి తేరిన దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, మళ్లీ కారే దిక్కని కొత్త రాజకీయాలు నెపరడం అంతా జనం గమనిస్తూనే వున్నారు. దాంతో ఈసారి దానంకు టిక్కెట్టు ఇవ్వడం టిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా ఇష్టం లేకుండాపోతోంది. ఒక వేళ దానం నాగేందర్‌కు ఇవ్వడం అంటూ జరిగితే కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులే కనిపిస్తాయంటున్నారు. దానం నాగేందర్‌కు ప్రత్యేకంగా వున్న బలమేమీ లేదు. కాకపోతే గత ఎన్నికల్లో మొత్తం టిఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసి పనిచేసి గెలిపించాయి. కాని ఆయన దాన్ని తన సొంత బలంగా ఊహించుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం అర్ధమైంది. దాంతో మళ్లీ గెలవాలంటే టిఆర్‌ఎస్‌ శ్రేణుల అవసరం ఎంతో అన్నది బోధపడినట్టుంది. దాంతో ఎన్నడూ లేని విధంగా నాయకులతో, కార్యకర్తలను పిలిపించుకొని భుజ్జగింపు కార్యక్రమాలు మొదలుపెట్టారు. 

దానం వర్సెస్‌ విజయారెడ్డి అనేది జరిగితే మాత్రం టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన పరిస్ధితులే ఎదురుకావొచ్చు.కాకపోతే దానం స్ధానంలో ఉద్యమ కారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఇస్తే మాత్రం ఖైరతాబాద్‌ మళ్లీ కారు సొంతం కావడం తధ్యమంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా రెండుసార్లు కార్పోరేటర్‌గా అవకాశం ఇచ్చిన టిఆర్‌ఎస్‌ను కాదని వెళ్లిన విజయారెడ్డి కూడా దానం వల్లనే పార్టీ మారినట్లు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే దానం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని తేలిపోయింది. విజయారెడ్డి ఎలాగూ పార్టీ వదిలేసి వెళ్లిపోయింది. అంతకు ముందు వెళ్లాలని దానం అనుకున్నాడు. అందుకే ఈ సారి ఉద్యమకారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడానికి మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!