
నేటిధాత్రి హసన్ పర్తి:
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో Meo కి వినతిపత్త్రం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ హై స్కూల్ (డేస్) పాఠశాలకు నర్సరీ నుండి 5 వరకు ప్రభుత్వ అనుమతి, లేకుండా మరియు బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ లేకుండా.. బిల్డింగ్ కూడ పర్మిషన్, విద్యార్థుల రవాణాకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సువాడాల్సింది ఉండగా తన ఇష్టానుసారం ప్రైవేటు వాహనాలను నడుపుతూ క్వాలిఫై టీచర్స్ లేకుండా వ్యాపారమే ధ్యేయంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాల నడుపుతున్న విద్యాధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు… కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఐదో తరగతి పిల్లవానికి 40 నుండి 50 వేల ఫీజులు వసూలు చేస్తూ… అదేవిధంగా పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పిలిచేస్తున్నారని ఇప్పటికైనా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో సీజ్ చేసి ఆ విద్యార్థులకు మరో పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డి ఈ వో ఆఫీస్ ను ముట్టడిస్తామని మరియు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్ యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి కసర బోయిన రవితేజ
నాయకులు రాజు పాల్గొన్నారు.