స్టేషన్‌ మాస్టర్‌ కడియమే!

తాటికొండ ను తప్పించి,కడియానికి స్టేషన్‌ రాసిచ్చినట్లే!!

తాటికొండపై శ్రేణులు వ్యతిరేకమే?

ఆది నుంచి తాటికొండ వివాదాల మరకలే!

ఎంతో నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా నిలుపుకోలేకపోయారు?

నమ్మకాన్ని ఆదిలోనే కోల్పోయారు?

గత ఎన్నికలోనే తప్పిస్తారనుకున్నారు?

అప్పుడు అందరి అంచనాలు కేసిఆర్‌ పటాపంచలు చేశారు?

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా చేశారు?

అలా కూడా రాజయ్యను గెలిపించుకున్నారు?

అయినా రాజయ్యలో మార్పు రాలేదు?

తాజాగా తమ్ముడికి దళితబంధు తో రాజయ్యపై విమర్శలు!

రాజయ్య మీద వున్న చిలిపి ప్రచారాలు మరెవరిమీదా లేవు?

అందుకే ఈసారి మార్చక తప్పదనుకుంటున్నారు?

నిజాయితీ పరుడుగా కడియం కు పేరు?

వివాదరహితుడుగా గుర్తింపు?

అజాతశత్రువు గా ఆది నుంచి అందరివాడు..

ఈసారి కడియంతోనే స్టేషన్‌ కు పట్టం..

నాయకులు, కార్యకర్తలు, ప్రజలది ఒకటే మాట…కడియం వస్తే కారుదే విజయం…

ప్రజాసేవ అన్నది ఒక దైవ కార్యం. ఒక రకంగా లక్షల్లో కొందరికి మాత్రమే వరించే వరం. ప్రజల్లో ఒకడిగా, ప్రజలందరికీ ప్రతినిధిగా, వారికి అండగా నిలిచే అదృష్టం అందరకీ వచ్చేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. పది కాలాల పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం. వారి జీవితంలో తరతరాల సుస్ధిర స్ధానం. అప్పుడే పది తరాలైనా ప్రజలు ఆ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకుంటారు. లేకుంటే మలితరం కూడా మర్చిపోతారు. అదేంటో నాయకులు కావడానికి ఎంతో కష్టపడతారు? ఎదురైన ప్రతి వ్యక్తిని పలకరిస్తారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. అండగా వుంటామంటారు. ఇల్లిల్లు తిరుగుతారు… హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తారు…ఇలా అనేక రకాలుగా ప్రలజకు చేరువ కావాలని చూస్తారు. పదవుల కోసం పాకులాడుతారు….కాని ఒక్కసారి ప్రజలు దీవించి ప్రజా ప్రతినిధిని చేస్తే అన్నీ మర్చిపోతారు. ఇలాంటి వాళ్లు కూడా చరిత్రలో చాలా మందే వుంటారు. అందుకే ప్రజల మేలు కోరిన నాయకులు ప్రజల గుండెల్లో నిలవగలుగుతున్నారు. ఎంత కాలమైనా వాళ్లే మాకు నాయకులుగా రావాలని కోరుకుంటారు. ప్రజలను మర్చిపోయేవారు, ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు రాజకీయాలకు దూరమౌతారు. ప్రజా జీవితం దూరం చేసుకుంటారు. అలాంటి రెండు రకాల నాయకత్వాలు కలగలిసి వున్న నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఒకరు కడియం శ్రీహరి, మరొకరు తాటికొండ రాజయ్య. ఇద్దరూ…ఇద్దరే…ఒకే ఒరలో రెండు కత్తులే…భిన్న దృవాలే…గతంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా నువ్వా నేనా అంతగా పోరు సాగిందే…ఇప్పుడూ అంతే…కాకపోతే అప్పుడు వైరి వర్గం…ఇప్పుడు స్వపక్షం…కాని ప్రజల గుండెల్లో వేరు…వేరే…ఒకే గూటిలో వున్నా, ఈసారి కూడా నువ్వా…నేనా…అంతే…ఇలాంటి రాజకీయ రాజీ పరిస్ధితులు చాలా అరుదు. ఎక్కడ జారిపోయిందో అక్కడ వెతుక్కోవాల్సిన దారిలో ఒకరు…దక్కిన చోట వదులుకోవడం ఇష్టం లేని నాయకుడు మరొకరు…కాకపోతే ఈసారి ఎన్నికల పరిస్ధితులు వేరు…అవకాశాలు కొన్ని సార్లు వెత్తుక్కుంటూ వస్తాయి. ఎవరికీ రాని అవకాశాలు మోసుకొస్తాయి…కాని నిలుపుకున్నప్పుడే వాటికి స్ధార్ధకత. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫోన్‌చేసి రాజయ్య నీకు అవకాశం ఇస్తాను…అని చెప్పి మరీ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే కడియం శ్రీహరి విషయంలోనూ ఎవరూ ఊహించని నాయకత్వం ఆయనకు అందిస్తానని కూడా కేసిఆర్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజలకు చెప్పారు. అది కాకతాలీయంగా జరిగినా ఇద్దరికీ అవకాశం అలా కలిసి వచ్చింది. కడియం శ్రీహరికి తన నాయకత్వ సమర్థతతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజయ్య చేజార్చుకున్నాడు. మంత్రి వర్గం నుంచి తప్పించబడ్డారు. అది స్వయంకృతాపరాధం. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించారు. ప్రతిపక్షాలు రాజయ్యను అడ్డంపెట్టుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేసి, అస్ధిర రాజకీయాలు సృష్టించే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని వారి ఎత్తులు, జిత్తులు చెల్లకుండా, వారి పాచికలు పారకుండా రాజయ్యకు అవకాశమిచ్చారు. రాజయ్య గెలుపు కష్టమే అనుకున్న చోట కడియం శ్రీహరితో సహా, నాయకులంతా కలిసి రాజయ్యను గెలిపించారు. కాని రాజయ్య చిలిపి పనులు తగ్గించుకోలేదు…ఆయన చేసే చేష్టలు ఆపుకోలేదు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మైనస్‌. ఎంత ఎదిగితే అంత ఒదిగి వుండాలన్నది మర్చిపోయాడు…తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాలి.

ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ప్రతి వ్యక్తి చూపును పసిగట్టుకుంటూ సాగాలి. అంతే కాని పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, నన్నెవరూ చూడడం లేదనుకుంటే ఎలా అన్నది..ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నికల ముందు రాజయ్యకు సంబంధించిన ఓ ఆడియో పెద్దఎత్తున వైరల్‌ అయ్యింది. అయినా అది పరువుపోయేంత పెద్దది కాదనుకున్నారో…ఏమోగాని..ఆ పనులు తగ్గించుకోలేదు…ఆ మధ్య ఓ బర్త్‌డే ఫంక్షన్‌లో మరో వివాదాన్ని మూట గట్టుకున్నారు. ఓ స్కూల్‌ విద్యార్ధిని చేత అన్నం తినిపించుకోవడం విమర్శల పాలయ్యారు. నాయకుడి ప్రజా జీవితం, అద్దాల మేడ ఒక్కటే…లోపలి నుంచి రాయి విసిరినా, బైట నుంచి రాయి పడినా అద్దమే పగులుతుంది. నాయకుడే ఇబ్బంది పడుతాడు. ఈ చిన్న లాజిక్‌ మర్చిపోయి, లక్షల్లో కొందరికి వచ్చే అరుదైన అవకాశాన్ని కూడా చేజార్చుకునే పనులే చేస్తూ వస్తున్నారు? అయినా ఇంకా అదృష్టం రాజయ్యకు కలిసి వస్తుందనే చెప్పాలి. తాజాగా రాజయ్య సోదరుడిపై ఓ మహిళ చేసిన పిర్యాధు కూడా రాజయ్యకు మరో ఎదురుదెబ్బనే తెచ్చిపెట్టింది. దానికి తోడు దళిత బంధు ఎంపికలో తన తమ్ముడి పేరును చేర్చి మొత్తం ప్రభుత్వం పరువు తీసినంత పనైంది. గతంలో పారా మెడికల్‌ ఉద్యోగాల అమ్మకాలే పదవిని పోగొట్టినా ఆయనలో మార్పు రాకపోవడం గమనార్హం. తనకు వ్యతిరేకంగా వున్నారన్న ఏకైక కారణంతో సొంత పార్టీకి చెందిన నేతలను, కార్యకర్తలను సైతం రాజయ్య ఇబ్బందులకు గురిచేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. వారిపై కేసులు నమోదు చేయించి, వారి జీవితాలతో ఆడుకున్నట్లు కూడా కొందరు చెప్పుకుంటారు. తన రాజకీయ జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చినా, ప్రజలు ఓ తరం గుర్తుంచుకునేలా పనులు చేయాల్సింది పోయి, చెప్పుకోవడానికి వివాదాలు తప్ప మరేం లేని నాయకుడయ్యాడు…రాజయ్య అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాడు…

ఇదిలా వుంటే ఒక నాయకుడు ఎంతకాలమైనా ఆ ప్రజల్లో గూడు కట్టుకొని వుంటాడని చెప్పడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒక సాక్ష్యమనే చెప్పుకోవాలి. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలు కొన్ని వేలమంది కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని ఒత్తిడి చేసిన సందర్భం చూశాం. రాజకీయంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన నాయకత్వ ప్రతిభను చూపించుకుంటూ ఎదిగిన నాయకుడు కడియం శ్రీహరి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించిన మంత్రి పదవులు విజయాలు ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేవే…ఒక తరం బాగుపడేందుకు ఉపయోగపడినవే…! ముఖ్యంగా తన సామాజిక వర్గం కోసం కడియం శ్రీహరి తన శక్తి మేరకు, పరిధి మేరకు కూడా ఎంతో చేశాడనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిన రిజర్వేషన్‌ కూడ అమలు జరగడానికి పరోక్ష, కారణం కూడా కడియం శ్రీహరే…సహజంగా సమాజంలో ఎస్సీ, ఎస్టీలను ఒక మెట్టు పైకి ఎక్కించేందుకు అంతకు ముందుగాని, తర్వాత గాని ఎవరూ చేయని పనులు కడియం శ్రీహరి చేశారు. ఎవరూ ఊహించనివి కూడా చేశారు. సాధ్యం కావనుకున్నది సుసాధ్యం చేశారు. ఇంటర్‌, డిగ్రీచేసిన ఎస్సీ, ఎస్టీయువతకు ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలిచే పరిస్ధితులు లేని సందర్భంలో వారికి కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిగా డిఎస్సీ నిర్వహించి సంచలనం సృష్టించారు.

ఆనాడు ఎన్ని అవరోధాలు ఎదరైనా ఆ డిఎస్సీ నిర్వహించారు. ఎంతో మంది జీవితాలల్లో వెలుగులు నింపారు. ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి, వారికి ప్రత్యేక ఉపాద్యాయ శిక్షణలిప్పించారు. దాంతో ఒక తరం ఎస్సీ, ఎస్టీల అడుగు ముందుకు పడిరదని చెప్పడంలో సందేహంలేదు. ఇక ఆయన హయాంలోనే పెద్దఎత్తున సుమారు 42వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయించి, విద్యారంగం పట్టిష్ట పర్చడంలో కడియం పాత్ర చెరిగిపోలేనది. చెరిపేయలేనిది. తెలంగాణలో దేవాదుల ఎత్తి పోతల అన్నది ఒక చరిత్ర. దానికి శ్రీకారం,నాంది, ప్రాస్తవన అంతా శ్రీహరే అని చెప్పకతప్పదు. ఇప్పటికీ స్టేషన్‌ ఘన్‌ఫూర్‌లో కనిపిస్తున్న అభివృద్ధి కడియం శ్రీహరి చేసిందే అన్న మాట ఎక్కడ విన్నా వినిపించేదే… ఇక నాయకుడిగా ఆయన 2004 ఎన్నికల్లో నాటి రాజకీయ పరిస్ధితుల మూలంగా ఓడిపోయారు. మళ్లీ, 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించిన నాయకుడు కడియం శ్రీహరి. ఏ పార్టీలో వున్నా, అంకితభావంతో పనిచేయడమే కాదు, తన శక్తియుక్తులను పార్టీ కోసం వినియోగిస్తారు. అందుకే ఆయనను మాటకారి, చేత కారి అని కూడా చెప్పుకుంటారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ 180 స్దానాలతో గెలిచినా, బలమైన ప్రతిపక్షం కూడా ఏర్పడిరది. నిత్యం ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలని, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రయత్నించేవారు. ప్రతి దాన్ని వివాదం చేస్తూ వుండేవారు. ఈ సందర్భంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా కనీసం ఎలాంటి జంకూ లేకుండా తొంబై మంది సభ్యులు నా వెనక వున్నారని అనుకుంటున్నారు…ఎంత మంది వున్నా మీరు ఏకాకే అంటూ వైఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా నాడు వైఎస్‌ చరిత్రను ఏకరువు పెడుతూ, తూర్పార పట్టారు. ఇలా తనదైన రాజకీయం నెరపడం కడియం తెలిసినంత రాజయ్యకు తెలియదు. రాజకీయంగా విజయాలే కాదు, నియోజకవర్గాన్ని ప్రగతి పధంలో నడిపారు. ఒక దశలో జిల్లాలో, నియోజవర్గంలో అడుగుపెట్టలేని పరిస్ధితులను కూడా ఎదరించి, మావోలనుంచి ముప్పుపొంచి వున్నా, లెక్క చేయకండా అభివృద్ధి కార్యక్రమాలకు హజరయ్యేవారు. ప్రజా జీవితంలో తన ప్రజా సేవను ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్లిన నాయకుడు కడియం శ్రీహరి. అందుకే ఈసారి స్టేషన్‌ ఘన్‌పూర్‌ టిక్కెట్టు కడియంకు ఇస్తే గులాబీ జెండాకు తిరుగుండదు. కడియం గెలుపును ఎవరూ ఆపలేరు…ఇదీ గ్రౌండ్‌ రిపోర్టు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!