సైబర్‌ నేరాలపై జర జాగ్రత్త గా ఉండాలి

ఎంజెపి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

శాయంపేటనేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ పిల్లలకి సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, మరియు 4 G విషయాలపై శాయంపేట ఎస్సై దేవేందర్ స్కూల్ ని సందర్శించి పిల్లలకి అవగాహన కల్పించినాడు.సైబర్‌ నేరాలు రోజురోజుకూపెరిగిపోతున్నాయి, టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా పోలీసులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించారు. అనవసర లింక్‌లను క్లిక్‌ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై వివరిస్తున్నారు. గుర్తుతెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, చాటింగ్‌కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు.సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి, తస్మాత్‌ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరించారు.అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్‌, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశచూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని ఆధార్‌ నంబర్‌ చెప్పండి మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండి.మీ ఏటీఎం పనిచేయడం లేదని మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామనీ ఇలా రకరకాలుగా సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు ఇలాంటి బారిన పడకూడదని వివరించారు.
కొత్త తరహా మోసాలు
సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకుపాల్పడుతున్నారు. మొబైల్‌కు వచ్చిన లింక్‌లు, మెసేజ్‌లు చదవకుండా క్లిక్‌ చెయవద్దు. అనుకోకుండా బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు పోతే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేస్తే సంబంధిత అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేస్తారు. పోలీసులను ఆశ్రయించాలి. ఈ కార్యక్రమంలో శాయంపేటఎస్సై దేవేందర్, కానిస్టేబుల్, ఆఫీసర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!