> రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
> పేలుడు పదార్థాల అక్రమ నిలువపై దృష్టి సాధించాలి.
> జిల్లా ఎస్పీ శ్రీ కే,నరసింహ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బుధవారం రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ సిబ్బందికి నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిపినారు.
ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతూ…
పొక్సో, ఎస్సీ ఎస్టీ మరియు గ్రేవ్ క్రైమ్ కేసుల యందు పరిశోధన పారదర్శకంగ చేయడంలో శ్రద్ధ వహించాలని అన్నారు, రోడ్డు ప్రమాదల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పేలుడు పదార్థాల అక్రమ నిలువలు పై తగిన చర్యలు తీసుకొవలన్నారు, రాబోయే ఎలక్షన్ నందు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల నందు ప్రత్యేక శ్రద్ధ వహించలని చెప్పారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా జరుగుతున్నందున రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్థవంతంగా కట్టడి చేసేందుకు జిల్లాలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో నియమించింది, దీనివల్ల పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయటమే ధ్యేయం.
ఈ కార్యక్రమంము అదన పీఎస్పీ రాములు, డిఎస్పీ లు మహేష్, రమణా రెడ్డి, ఎ ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఎఓ,శ్రీమతి రుక్మిణీ, సీసీ రాంరెడ్డి, ఇన్స్పెక్టర్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.