` రిజిస్ట్రేషన్ కార్యాలయమంటేనే హడలి పోతున్న ప్రజలు
` ప్రైవేటు సైన్యం చూసి భయపడుతున్నారు
` ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంటే, పాలకులు ఎందుకు స్పందించడం లేదు?
` టిఆర్‌ఎస్ నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదు?
` అధికారగణం చేసే ప్రతి తప్పుకు పాలకపక్షాన్నే ప్రజలు నిందించేది?
` పట్టించుకోకపోతే టిఆర్‌ఎస్ పార్టీయే నిందలు మోయాల్సివుస్తుంది?
హైదరాబాద్ , నేటిధాత్రి :
ఒకప్పుడు నాయకులు సంపాదనలో మా కొచ్చేదెంత? మాకిచ్చేదెంత? మా లెక్కెంత? ఉల్లిగడ్డమీద పొట్టంతా? అని అధికారులు సరదాగా చెబుతుండేవారు. నిజానికి అప్పటి రోజులు కూడా అలాంటివే…ఏ టి( చాయ్) డబ్బులో అన్నట్లు వుండేది. పెద్దస్ధాయిలో ఉన్న అధికారులకు అది
కూడా దక్కేది కాదు. ఎందుకంటే వారికి హోదా తప్ప, మరొకటి ఆలోచించేవారు కాదు! అందుకే గతంలో ఉన్నత స్ధాయి అధికారులంటే ప్రజల్లో కూడా ఒక గౌరవం వుండేది. ఇప్పుడు అది లేదు. ఎందుకో అందరికీ తెలుసు. కాలం రివర్స్ అయ్యింది. ఇప్పుడు పెద్ద పెద్ద అధికారుల
సంపాదనలో మేమెంత అని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపి స్ధాయి నాయకులు కూడా అదే మాట అంటున్నారు. తాజాగా ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన మాజీ ఎంపి.అంజన్ కుమార్ యాదవ్ కుమారుడుపై ఈ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం
లో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అంజన్ కుమార్ లాంటి మేమెంత? మాకు అంత సీన్ లేదు? అన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలున్నారన్న వార్తలొస్తున్నాయన్నారు. అంటే సమాజం ఎక్కడికి పోతోంది? ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా ఉన్నతాధికారుల పిల్లలే వుంటున్నారు.
కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒకప్పుడు నాయకులు నాలుగు ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి, నాలుగు రూపాయలు సంపాదించి, ఎన్నికల్లో ఖర్చు చేస్తుండేవారు. కాని ఇప్పుడు ఎమ్మెల్యేలైనా సరే రియలెస్టేట్ వ్యాపారాలు చేయాలి. ఆ సంపాదనలో వచ్చిన సొమ్మును
మళ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయాలి. నిత్యం కార్యకర్తలను, అనుచరులను కాపాడుకుంటూ వుండాలి. వారిని పోషించాలి. అందుకోసం వారు పడరాని పాట్లు పడుతుండడం చూస్తున్నాం. కాని ఒకస్ధాయిలో వున్న అధికారులు ఎమ్మెల్యేలను మించిపోయి, ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఏకంగా వాళ్లు కార్యాలయాల్లోనే పెత్తనం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసే ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఉన్నతాధికారి ప్రైవేటు సైన్యం శాసిస్తుందోన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సమాజం ఎక్కడికిపోతోంది?
ఇటీవల ఓ సబ్ రిజిస్ట్రార్‌పై నేటిధాత్రిలో కథనాలు ప్రచురించింది. దాంతో సదరు ఉద్యోగి తనపై అసత్య ప్రచారం సాగుతున్నట్లు తోటి ఉద్యోగులకు మొరపెట్టుకునే ప్రయత్నం చేసింది. తోటి ఉద్యోగులను పురుగులకంటే హీనంగా చూస్తుందని అదే శాఖకు చెందిన ఉద్యోగులు
చెబుతుంటారు. అంతే కాకుండా ఎంతో మంది ఉద్యోగులను వేధించినట్లు, బాధితులు కూడా చెప్పుకోలేక మధనపడుతున్నారని తెలుసు. అంటే ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసినప్పుడు సదరు ఉన్నతాధికారికి, తోటి ఉద్యోగుల ఆత్మాభిమానం కనిపించలేదు. తనపై వార్తలు వస్తున్నాయని,
ఉద్యోగుల తోడు కావాలా? ఇది స్వార్ధం కాదా? సరే…తను నిర్విర్తించాల్సిన విధులను, ఎంతో సీక్రెట్‌గా వుంచాల్సిన యూజర్ ఐడిని ప్రైవేటు వ్యక్తికి అప్పగించడం తప్పు కాదా? నేరం కాదా? అది మాసిపోతుందా? యూజర్ ఐడి తొలగించామని అనుకుంటే సరిపోతుందా? నేరం చేసి,
ఒప్పుకుంటే వదిలేయాలా? అయినా తన దారి మార్చుకోకుండా, తన వ్యవహారం మార్చుకోకుండా ప్రైవేటు సైన్యం ఆగడాలు ఆగలేదనే కదా ప్రజలు అంటున్నది.
` తోటి ఉద్యోగులకు ఫోన్లు?
తానపై ఓ దిన పత్రిక వార్తలు రాస్తుంటే మీరెవరూ మాకు సపోర్టు చేయకపోతే ఎలా? రేపు మీకు ఇదే పరిస్ధితి వస్తే, మీకు మద్దతిచ్చేవారు ఎవరు? మనమంతా ఒక్కటి? మనం యూనిట్‌గా వుండాలి? మనం, మనం సముదాయించుకో
వాలి. అని తోటి ఉద్యోగులకు సదరు ఉద్యోగి పోన్ చేస్తున్నట్లు సమాచారం. అలా తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో నేటిధాత్రి దినపత్రిక మీద నమోదైన ఓ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏ పత్రికపైనా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు కేసులు
ఎదుర్కొవడం కామన్. అప్పుడు మమ్మల్ని రక్షించడని ఏ పత్రిక సానుభూతి కోసం పాకులాడదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని నిలబడుతుందే తప్ప, ఆగం కాదు. అది వ్యవస్ధలో భాగం. ఒక పత్రిక నిజాయితీకి అలాంటివి నిదర్శం. అంతే కాని ఒక ఉద్యోగి ఆరోపణలు
రాకుండా నీతిగా, నిజాయితీగా పనిచేయాలి? అదే సమాజం కోరుకునేది. ఒక పత్రికపై కేసు నమోదైందటే అది వ్యక్తిగతం కాదు? అది వ్యవస్ధకు సంబంధించిది. కాని ఉద్యోగి మీద ఆరోపణలు వస్తే అది అందిరి మీద వచ్చినట్లు కాదు..ఈ విషయం తెలుసుకోకుండా నేటిధాత్రి మీద
బురదజల్లాలని చూస్తే చిల్లేది వాళ్లమీదే…నాయకులు దారి తప్పినప్పుడు కూడా మీడియా ప్రశ్నిస్తుంది. అలాంటి సమయంలో కేసులు నమోదు అన్నది సహజ ప్రక్రియ. దాన్ని బూచిగా చూపి నేటిధాత్రిని నిందిద్దామని చూస్తే సరిపోతుందా? ఒక పత్రిక మొత్తం సమాజానికి చెందినది. ఒక
ఉద్యోగి మీద ఆరోపణ వ్యక్తిగతమైది. అన్ని దారులు మూసుకుపోయి, ఏదారిలో వెళ్లాలో తెలియనప్పుడు ఇలాంటి పనులే చేస్తారు.
` ఎఫ్‌ఐఆర్ బహింరగపర్చడం కూడా నేరమే
ఎఫ్‌ఐఆర్ అనేది పూర్తిగా గోప్యమైనది. అయినా మీడియాపై కేసు అన్నది వ్యక్తిగతమైంది కాదు. వ్యవస్ధాపరమైంది. అందులోనూ మీడియా రంగానికి చెందిన ఎఫ్‌ఐఆర్ బైటకు రావడం అన్నది నేరం. రాజ్యాంగ బద్దంగా
దేశంలోనే అత్యున్నతమైన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటుంది. కాని ఎంప్లాయిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నది ఉండదు. ఎఫ్‌ఐఆర్ ఇచ్చిన వారిపై, దాన్ని సామాజిక మాధ్యమాలలో తిప్పడం కూడా నేరమే? ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అమాయకులైన యువకులను
కూడా నేరస్ధులను చేస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ కౌన్సిల్‌కు పిర్యాధు చేస్తే అందరి ఉద్యోగాలు పోతాయి. ముందు ఇది తెలుసుకోండి..? నేటిధాత్రి సదరు ఉద్యోగిని ప్రజా సేవ చేయొద్దని చెప్పడంలేదు. సేవ చేయడం అనేది గొప్ప గుణమనే నేటిధాత్రి గుర్తు చేస్తోంది. ఆ సేవ కోసం
ఉద్యోగ ధర్మంలో అధర్మం వద్దనే నేటిధాత్రి అంటోంది. ప్రజల వద్ద నుంచి రూపాయి వసూలు చేయొద్దని మాత్రమే చెబుతుంది? ఇది కూడా తప్పేనా? నేటిధాత్రి మంచి చెబుతున్నట్టా? లేదా? అన్నది ఇతర ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాలి. ఒక తప్పు పది తప్పులను ప్రోత్సహిస్తుంది.
స్పందించిన జిల్లా రిజిస్ట్రార్
` స్పందించిన డిఆర్ రవి
` త్వరలో విచారణ చేపడతాం…
` విషయాలు ఒక్కొక్కటీ తెలుస్తున్నాయి
` యూజర్ ఐడి తొలంగించారు…
` ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం
` దర్యాప్తు తర్వాత చర్యలు
ఎట్టకేలకు జిల్లా రిజిస్ట్రార్ రవి స్పందించారు. నేటిధాత్రి దినపత్రికల్లో వస్తున్న వరుస కథనాలు చూస్తున్నట్లు చెప్పారు. వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనేక విషయాలు తెలుస్తున్నాయన్నారు. గతంలో ఏం జరిగిందో కూడా మొత్తం
వివరాల రాబట్టాల్సివుందని చెప్పుకొచ్చారు. గతంలో యూజర్ ఐటి ఇచ్చినట్లు , దాన్ని అప్పుడే రిమూవ్ చేసినట్లు కూడా ఆయన వెల్లడిరచారు. ఈ విషయం పై అధికారుల దృష్టిలో కూడా వుంది. ఈ విషయం డిస్టిక్ట్ రిజిస్ట్రార్ కూడా దృష్టిలో వుందన్న సంగతి చెప్పారు. అయితే అప్పుడు
ఏం జరిగింది? ఎంక్వైరీ ఏలా జరిగింది? ఏం రిపోర్టు చేశారు? సంజాయిషీ ఏమిచ్చారు? రిపోర్టులో ఏముందన్నదానిని కూడా పూర్తి స్ధాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు. యూజర్ ఐడికి సంబంధించిన విషయాలు కమీషనర్ కార్యాలయానికి పిర్యాధు చేయాల్సి వుంటుందన్నారు.
అక్కడి నుంచి వివరాలు సేకరించి, దర్యాప్తు మొదలు పెడతామన్నారు. తప్పు చేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా రిజిస్ట్రార్ రవి నేటిధాత్రితో చెప్పారు. మొత్తం మీద అక్కడ ఏం జరుగుతోంది. ప్రైవేటు సైన్యమేమిటన్నదానిపై కూడా పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టాల్సిన
అవసరం వుందన్న విషయం వెల్లడిరచారు. త్వరలో ఎంక్వరీ చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు.