సురేష్‌ క్రియేషన్స్‌…

ఆర్వో సిరీస్‌….
దొంగ ఛలాన్లతో దోపిడీ!?


టాగ్‌ లైన్‌ ‘చిక్కడు`దొరకడు’?
స్టాంపు వెండర్లను ఇరికించాడు?
రిటైర్డ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు పెన్షన్‌ లేకుండా చేశాడు?
16లక్షల స్టాంపు పేపర్లు మాయం చేశాడు?
సస్పెండ్‌ అయినా తిరిగి ఉద్యోగంలో చేరాడు?
రెండు కేసులు? రెండు సార్లు జైలు??
కేసు నడుస్తున్నా…ప్రమోషన్‌?
ఇంత వరకు ఏ సినిమాలో చూడని అద్భుతమైన మలుపుల అవినీతి….?
తన మీద విచారణ ఫైల్‌ తన చేతిలోనే???
సహజంగా సర్వే జనా సుఖినోభవంతు అని అందరం అనుకుంటాం. మీ అందర్నీ దోచుకుంటేనే

మేం బాగుంటామని కొందరు అనుకుంటారు? అందులో ఒక్కరు ఆర్వోలో పనిచేసే ఓ సూపర్‌ సూపరెండెంటు?

అధ్భుతమైన స్క్రీన్‌ప్లేతో తన అవినీతి ఉద్యోగ జీవితాన్ని అందంగా మల్చుకుంటూ సాగుతున్నాడు. తన వద్దకు వచ్చే వారిని అధ్భుతంగా ఇరికిస్తూ, వారిపై నెపం నేట్టేస్తూ అందర్నీ నమ్మిస్తున్నాడు. కేసులైనా, జైలైనా సరే…ఎప్పటికీ వుంటుందా? ఎప్పుడూ అనుభవిస్తామా? సంపాదిస్తే చాలు…అదే మనల్ని కాపాడుతుంది? మేనేజ్‌ చేసేందుకు ఆ మనీ ఉపయోగపడుతుంది? ఇదీ సదరు ఉద్యోగి ఆలోచనాపర్వం…ఆర్వోలో 16లక్షల మాయానికి శ్రీకారం…
కరీంనగర్‌ జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపు కార్యాలయంలో దశాబ్ధం క్రితం రూ.16లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమయ్యాయి. అందరి చూపు ఒక్కడిమీదే వుంది. అందరి వేళ్లూ అతన్నే చూపిస్తున్నాయి.కాని ఆయన చూపించే వేలుకే పవరెక్కువ అని తేలింది. ఆయన వైపు వేలు చూపించిన వారిని ఇరికించి, వారి లైసెన్సులు రద్దు చేయించాడు. అతని పైఅధికారికి రిటైర్డైనా పెన్షన్‌ లేకుండా చేశాడు…రెండు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.రెండుసార్లు జైలు జీవితం అనుభవించాడు. కొంత కాలం ఖాళీగా వున్నాడు. పై వాళ్లను ప్రసన్నం చేసుకున్నాడు. తిమ్మిని బమ్మిని చేశాడు. తనదేం తప్పులేదని నమ్మించాడు. ఎంక్వరీ వేసిన అధికారుల చేతనే, పోనీ పాపం అనిపించేలా చేసుకున్నాడు. తిరిగి తన ఉద్యోగం తాను సంపాదించుకున్నాడు. తర్వాత ప్రమోషన్‌ కూడా పొందాడు. జూనియర్‌ అసిస్టెంటు నుంచి సీనియర్‌ అసిస్టెంటు అయ్యాడు. సస్పెన్షన్‌ తొలగించుకొని ప్రమోషన్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ అయ్యాడు. తాగా 317 జీవోతో. డిఐజీ కార్యాలయంలో పోస్టింగ్‌ కొట్టేశాడు. విచిత్రమేమింటే తన ఎదుర్కొంటున్న విచారణకు సంబంధించిన ఫైలు తన చేతుల్లో పెట్టుకున్నాడు. తనపై విచారణకు ఆదేశించిన పెద్దలందరి సేవలు చేస్తూ తరిస్తున్నాడు. వారి చేత ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే: చాలా ఇంట్రెస్టింగ్‌ కథ. ప్రతి మలుపులోనూ ట్విస్టులే …ట్విస్టులు…ఎండిరగ్‌ లేకుండా మలుపులతోనే సాగుతున్న అధ్భుత నిజ కధ…అవినీతి ఎలా చేయాలో…చేసినా ఎలా తప్పించుకోవాలో…సినిమాలో కూడా ఇంతవరకు చూపించనటువంటి కథ. కొన్ని శాఖలకు బాగా తెలిసిన కథ. పాపం ప్రజలే వింటే ఆశ్చర్యపోయే కథ. విస్తుపోయే కథ.
ఆయన పేరు…సురేష్‌…కరీంనగర్‌ జిల్లాలోని డిఐజి కార్యాలయంలో ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంటు.ఫ్లాష్‌ బ్యాక్‌కు ఒక్కసారి వెళితే…వరంగల్‌ జిల్లాకు చెందిన సురేష్‌ వాళ్ల తండ్రి సబ్‌ రిజిస్ట్రార్‌. ఆయన ఉద్యోగాన్ని కారుణ్యనియాకమంలో తన కుమారుడు సురేష్‌ ఇచ్చారు. అదే శాఖలో క్లర్క్‌గా కరీంనగర్‌లో జాయిన్‌ అయ్యాడు. ప్రతి జిల్లా రిజిస్ట్రేషన్‌, స్టాంపు కార్యాలయంలో రెండు రకాల సెక్షన్‌లుంటాయి. అడ్మినిస్ట్రేటివ్‌ బ్రాంచ్‌ (ఏబి) స్టాప్‌ కౌంటర్‌. ఒరిజినల్‌ బ్రాంచ్‌ (ఓబి)స్టాంప్‌ కౌంటర్‌. ఓబి. స్టాంపు కౌంటర్‌లో సురేష్‌ క్లర్క్‌. ఈ క్లర్క్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధి విభాగంలో విధులు నిర్వర్తించాడు. కొంత కాలానికి ప్రమోషన్‌ వచ్చింది. సీనియర్‌ అసిస్టెంట్‌ అయ్యాడు. కార్యాలయంలో వున్న పై అంతుస్థులోని ఏబి. కౌంటర్‌కు మార్చబడ్డాడు. కాకపోతే కింద వున్న ఓబి స్టాంపు కౌంటర్‌ పనులు కూడా అతనే నిర్వర్తించాడు. నిజానికి ఈ పని వదిలేయాలి. ఆ స్ధానంలోకి మరో క్లర్కు వచ్చినా వాటి పర్యవేక్షణ పై వారి ఆశీస్సులతో సురేషే చూసుకుంటూ వచ్చేవాడు. అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌కూడా సురేష్‌న గుడ్డిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతో స్టాంపు పేపర్ల పర్యవేక్షణలో నిర్లిప్తత వహించాడు. సురేష్‌ ఏది చెబితే అదే నిజమని నమ్మేవాడు. ఇదే సురేష్‌కు కలిసొచ్చింది. ఆదాయ మార్గానికి సుగమమైంది. ఎన్ని వెళ్తున్నాయి, ఎన్ని ఛలాన్లు వస్తున్నాయన్నదానిపై సురేష్‌ను గుడ్డిగా నమ్మిన సదరు సబ్‌రిజిస్ట్రార్‌కు మోసం చేస్తున్నట్లు ఎప్పుడూ అనుమానం రాకుండా చూసుకున్నాడు. నిజానికి స్టాంపు పేపర్లు గతంలో ఎస్టీవో కార్యాలయంలో ఇచ్చేవారు. రిజిస్ట్రేషన్లు ఇక్కడ, స్టాంపు పేపర్లు అక్కడ కావడంతో అన్నీ ఇక్కడే దొరికేలా ప్రభుత్వం వీలు కల్పించింది. ఇదే సురేష్‌ లాంటి ఉద్యోగుల పాలటి వరమైంది. ఇంకేముంది. సబ్‌ రిజిస్ట్రార్‌కు సురేష్‌ అంటే పూర్తి నమ్మకం ఏర్పడిరది. దాంతో సురేష్‌ తన చేతి వాటం చూపించడం మొదలు పెట్టాడు. అప్పుడిరత…అప్పుడిరత అన్నట్లు రూ.18లక్షల దుర్వినియోగానికి చేరింది. అది కాస్త ఓసారి బైట పడిరది. నాన్‌ జ్యుడీషియల్‌, ప్రాంకింగ్‌ మిషన్‌ పేపర్లు సురేష్‌ మాయం చేశాడని తేలింది. స్టాంపు వెండర్ల నుంచి డబ్బులు తీసుకోవడం…వారికి నేరుగా స్టాంపు పేపర్లు ఇచ్చాడని తెలిసిపోయింది. ఈ విషయం శాఖ పెద్దలకు తెలియడంతో విచారణ చేపట్టారు. జరిగిన అవినీతి నిజమే అని గుర్తించారు.అయితే జరిగిన విషయంలో తాము కలుగ జేసుకోకపోతే ఇది పెద్దదయ్యే ప్రమాదముందని పెద్దలు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా సురేష్‌ను కాపాడే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అప్పటి జల్లా అధికారి రమణారావు ఆశీస్సులతో సురేష్‌ ఎలా బైటపడాలో సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ఎవరెవరైతే స్టాంపు వెండర్లు డబ్బులు ఇచ్చి, ఛలాన్లు తీసుకెళ్లారో…వారి పేరు మీద పకడ్భందీగా డిడిలు తీసి, ఆ సొమ్మును సురేష్‌ చెల్లించేశాడు. విచారణలో సురేష్‌  తప్పేం లేదని, అంతా స్టాంపు వెండర్లదే తప్పని రిపోర్టు ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి స్టాంపు వెండర్లను అదుపులోకి తీసుకొని, విచారించగా సురేష్‌ చేసిందే తప్ప, మేం చేసిందేమీ లేదని జరిగిన విషయాలు పూస గుచ్చినట్లు చెప్పేశారు. డామిట్‌ సురేష్‌ కథ అడ్డం తిరిగింది. రెండు రకాలు స్టాంపు డ్యూటీల మూలంగా రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. రెండు సార్లు జైలు కెళ్లడం జరిగింది. మళ్లీ రంగంలోకి దిగిన శాఖ పెద్దలు మళ్లీ సురేష్‌కు కాపాడుకుంటూ వచ్చారు.
పెద్దల ఆశీస్సులు మెండుగా?: ఓ వైపు కరీంనగర్‌లో రెండు రకాల కేసుల మీద విచారణ జరుగుతున్న క్రమంలోనే సురేష్‌ తిరిగి విధుల్లో చేరాడు. తర్వాత డిఐజి. నాయుడు రంగంలోకి దిగి మళ్లీ విచారణకు ఆదేశించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో! కాని ఆయన కూడా సురేష్‌కు అనుకూలంగానే రిపోర్టు ఇచ్చేశారు. ప్రమోషన్‌కు బాటలు వేశారు. పెద్దపల్లిలో కొంత కాలం సబ్‌ రిజిస్ట్రార్‌గా సురేష్‌ పనిచేయడానికి మార్గం సుగమం చేశారన్న ఆరోపణలు వున్నాయి. ఇటీవల జివో నెంబర్‌.317 మూలంగా సబ్‌ రిజిస్ట్రార్‌గా నుంచి తిరిగి ప్రస్తుతం డిఐజీగా వున్న ట్వింకిల్‌ జాన్‌ కార్యాలయానికి తబాదల మీద వచ్చాడు. గతంలో దశాబ్ధం క్రితం జరిగిన అవకతవల మీద మళ్లీ దర్యాప్తుకు ఆదేశించిన డిఐజి. పదకొండు నెలల తర్వాత ఎలాంటి విచారణ జరగకుండానే సురేష్‌ తప్పేం లేదని రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ట్విస్టేమిటంటే ఇప్పటికీ కొనసాగుతున్న విచారణ ఫైలు, సురేష్‌ను దోషిగా నిరూపించే ఫైలు తిరిగి తిరిగి ఇప్పుడు ఆయన టేబుల్‌ మీదకు వచ్చింది. ఆయన చేతిలోనే వుంది? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టకుండా పోవడం అంటే ఇదే…సినిమాల్లో కూడా ఇంతటి సీన్లు ఎవరూ చూపించలేదు. కరీంనగర్‌లో ఇప్పటికీ రెండు కేసులు మీద విచారణ జరుగుతోంది. అవి క్రిమినల్‌ కేసులు. అయినా ఆయనకు ఉద్యోగం మళ్లీ వచ్చింది. ప్రమోషన్‌ వచ్చింది. సేఫ్‌గా డిఐజి కార్యాలయానికే ఉద్యోగం అలాట్‌ అయ్యింది. తన మీద విచారణ ఫైల్‌ తన చేతిలో భద్రంగా వచ్చి వాలింది. దీన్ని ఏమంటారు…వెతకబోయే తీగ కాలికి తగినట్లే…కదా? కాకపోతే ప్రభుత్వ ధనం ధనం దుర్వినియోగం చేసి, స్టాంపు వెండర్ల లైసెన్సులు రద్దుకు కారణమై, నమ్మినందుకు తనకేం సంబంధంలేని ఓ రిటైర్డు సబ్‌ రిజిస్ట్రార్‌కు పెన్షన్‌ రాక పోవడానికి కారణమైన సురేష్‌పై ఇప్పటికైనా విచారణ వేగవంతమౌతుందా? లేకా అక్కడే కథ కంచికి చేరుతుందా? అన్నది ఉన్నత స్ధాయి అధికారులే తేల్చి చెప్పాలి. అసలే తెలంగాణలో పరిపాలనా సంస్కరణల కమిటీకి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజి అండ్‌ కమీషనర్‌ శేషాద్రి అధ్యక్షత వహిస్తున్నాడు. అసలు ఆయన శాఖలో ఎలాంటి అవినీతిని ఆయన సహించరు. అలాంటిది ఏకంగా స్టాంపులు దుర్వినియోగం చేసి, దొంగ ఛలాన్లను సృష్టించి, డిడీలతో మాయ చేసి, సస్పెండ్‌ అయ్యి, కేసులు విచారణలో వుండగానే తిరిగి విధుల్లో చేరి, ప్రమోషన్లు పొందిన సురేష్‌ను ఉద్యోగ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయనకు సహరించిన ఉన్నతాధికారులపై కూడా ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!