తంగళ్ళపల్లి నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ నవ తెలంగాణ రిపోర్టర్ కారంగుల వినోద్ రావ్ కు ఘన నివాళులు అర్పించి, మౌనం పాటించిన విలేఖర్లు. ఈ సందర్భంగా వారు వినోద్ రావ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతుల అంజనేయులు, ఉపాధ్యక్షుడు సిరిపాక ప్రణయ్, ప్రధాన కార్యదర్శి రంగు శ్యామ్, సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు, గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్, సామల గట్టు, వెంగల శ్రీనివాస్, క్లబ్ సభ్యులు గుగ్గిల్ల పరమేష్, బర్ల బాలు ఉన్నారు.