సీనియర్లను పక్కా పక్కనపెట్టుడే!?

` తెలుగు కాంగ్రెస్‌ చేయడమే లెక్క!

`చంద్రబాబు చెప్పిందే జరిగేదక్కడ?

` కాంగ్రెస్‌ నిండా తెలుగు దేశం నేతలు నింపుడే…సీనియర్లకు రిటైర్మెంట్‌ ఇచ్చుడే!

` పైకి నవ్వుతూనే పక్కకు నెట్టేసుడే!

`ఏఐసిసి ఎన్నికలే వేదికగా మొదలైన పర్ఫెక్ట్‌ స్కెచ్‌!

`ఏఐసిసి ఎన్నికలలో సీనియర్లుకు అటు పిలుపు…ఇటు పులుపు!

` గాంధీ భవన్‌ సాక్ష్యిగా అవమానం!

`పొమ్మనలేక పొగబెట్టడమే రేవంత్‌ రాజకీయం…

` పొన్నాల మనస్తాపం….

`దామోదర రాజనర్సింహా నారాజ్‌….

`ఒక్కొక్కరిగా బడుగు నేతలను బైటకు పంపుడే!

`ఆత్మాభిమానం వున్న నేతలే గురి….

`సీనియర్లను దూరం చేస్తే రేవంత్‌ పెత్తనం సాగేది….

`అడుగడుగునా తన అనుచరులే వుండాలే…రేవంత్‌ కు ఎదురులేకుండా కథ నడవాలే!

`ఔట్‌ డేటెడ్‌ నేతలంతా అంతా డస్ట్‌ బిన్‌ కే….

`ఎపుడొచ్చామన్నది కాదు…ఎదురులేకుండా ఏలామా లేదా?  

`గెలిచినా, ఓడినా లెక్కలేదు…సీనియర్లకు తలవంచేది లేదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను పార్టీనుంచి సాగనంపే కార్యక్రమం మొదలైనట్లే కనిపిస్తోంది. వారిని పార్టీనుంచి పంపించడం ఖాయంగానే కనిపిస్తోంది. గతంలోలాగా అంతర్గత ప్రజాస్వామ్యంలో కొంత కోత మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో పార్టీ బతికి బట్టకట్టాలంటే సీనియర్లను పార్టీకి దూరం చేయడం ఒక్కటే సరైన నిర్ణయం అనుకుంటున్నారట. దీనిపై పిపిసి. అధ్యక్షుడురేవంత్‌ వర్గంలో సాగుతున్న గుసగుసగా సమాచారం అందుతోంది. అందుకే సీనియర్లను పొమ్మనలేక పొగ పెట్టే కార్యక్రమం బాగానే జరుగుతోందని అర్ధమౌతోంది. ఇటీవల జరిగిన ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు సీనియర్ల పెద్దరికానికి, అర్హతలకు, అధికారాలకు కోత పెట్టడం జరిగనట్లే కనిపిస్తోంది. తెలంగాణ తొలి పిపిసి అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి కూడా అన్యాయం జరిగిందన్న స్పష్టమౌతోంది. కనీసం ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పొన్నాల తన వర్గానికి ఓటు వున్నా, వినియోగించుకోలేని స్ధితిని కల్పించడం కూడా ఆపరేషన్‌ వికర్ష్‌లో భాగమే అని తేలుతోంది. అంతే కాడు మాజీ ఉప ముఖ్యమంతి దామోదర రాజనర్సింహకు కూడ ఆవమానం జరగడం అన్నది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయినా దానిపై మాట్లాడేందుకు సైతం ఏ సీనియర్‌ ముందుకు రాకపోవడం గమనార్హం. 

సీనియర్ల ఈగోపై కొడితే వారి దిమ్మ తిరుగుతుందో అదును చూసి మరీ కొట్టడం అంటే ఇదే మరి…

సహజంగా సీనియర్‌ నేతలందరకీ ఈగో ఎక్కువ. వారు తమకు పదవితోపాటు, పరపతి, గౌరవం, మర్యాద, కీర్తి, ఆహ్వానం కోరుకుంటారు. తమకు ప్రత్యేక ప్రాధన్యత కల్పించకపోతే ఆగమాగం చేస్తుంటారు. గతంలో అంటే సీనియర్ల ఆటలు చెల్లాయి. వారు ఆడిరది ఆట పాడిరది పాటగా వుండేది. ప్రత్యేక ప్రాధాన్యాలు కూడా పొంది తిరుగులేని నేతలుగా, తమ మాట చెల్లుబాటు చేసుకునేవారు. కాని కాలం మారుతోంది. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రజల్లో పార్టీలు వుండాలంటే బలమైన నేతలు కావాలి. ప్రజలను ప్రసన్నం చేసుకునే నాయకులు కావాలి. ప్రజలకు ఎంతైనా ఖర్చుచేసే శక్తి యుక్తులున్న నాయకులు కావాలి. 

 నాయకుడిని చూసి ఓట్లేసే కాలం పోయింది.

 పార్టీని నడిపేవారిని చూసి ఓట్లు పడే కాలమొచ్చింది. పార్టీ నిలబెట్టేవాళ్లంతా గెలుపు గుర్రాలు కావాలి. రియలెస్టేట్‌ కింగ్‌లై వుండాలి. పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేసే ధైర్యం వున్నవారు కావాలి. అవసరమైతే అప్పులు చేసైనా పార్టీకి పది రూపాయలు పంపేవారు కావాలి. ఎన్నికల నాడు ఎంతైనా ఖర్చుకు వెనకడాని వారు మాత్రమే కావాలి. ఇవన్నీ సీనియర్ల నుంచి కావు. అంత డబ్బు వారి దగ్గర లేదు. వున్నా ఖర్చు పెట్టేందుకు మారి మనసొప్పదు. పైగా పార్టీ ఏమిస్తుందా? అని ఎదురు చూస్తారు. అందువల్ల సీట్లిచ్చి, ఎదరు సొమ్మిచ్చి, ఓడిపోవడం కన్నా, గెలుపు గుర్రాలను ప్రోత్సహిస్తే మరో ఇరవైఏళ్ల రాజకీయం పార్టీకి పదిలం. ఇదే ఇప్పటి రాజకీయం…అదే రేవంత్‌ ఫాలో అవుతున్నాడు..అందుకే ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలు వేధికగా చేసుకొని రేవంత్‌ ఒక రకంగా చెప్పాలంటే రెచ్చిపోయాడు..?సీనియర్లకు రaలక్‌ ఇచ్చాడు… తన తప్పేం లేదన్నట్లు ఇన్నేసెంట్‌ స్టేట్‌ మెంటు ఇచ్చేశాడు…తాంబూలాలిచ్చాను…ఇక మీ సావు మీరు సావండి? అన్నట్లు జరుగుతున్న తమాషా చూస్తున్నాడు…సీనియర్లను ఎక్కడ నొక్కితే గిలగిల కొట్టుకుంటారో అక్కడ రేవంత్‌ నొక్కి వదిలిపెట్టాడు. దాంతో సీనియర్లు ఊపిరి సలపకుండా పోవడం చూసి స్కెచ్‌ వర్కవుటైందని రేవంత్‌ వర్గం ఒకింత సంతోషపడినట్లే తెలుస్తోంది. ఇలా చేస్తే నాలుగు రోజులు తమ అసంతృప్తిని సీనియర్ల వెల్లగక్కుతుంటారు…అది కూడా పార్టీకి మైలేజే తెచ్చిపెడుతుందన్నది ఒక వర్గం వాదన. పైగా పార్టీ గురించి ప్రజల్లో చర్చ జరగుతుంది. 

  సీనియర్లను ప్రజలే చీదరించుకుంటారు..ఇంకా మీకు పదవులు కావాలా అని దెప్పిపొడుస్తారు.

..ఈ సమయంలో ఓ నాలుగు రోజులు సీనియర్ల మాటలను కవర్‌ చేసే మీడియా కూడా చేతులెత్తేస్తుంది. వాళ్లు పిలిచినా వెళ్లకుండా తప్పించుకుంటుంది. రోజూ అదే సోది అనుకుంటూ కొత్త వార్తల కోసం మీడియా ఆలోచిస్తుంది. ఇంకే ముంది మీడియా కూడా మొహం చాటేయడంతో పిలుపు లేని, గౌరవం దక్కని గాంధీభవన్‌కు వెళ్లడం ఎందుకని సీనియర్లు వెళ్లడం మానేస్తారు… పిసిసి కూడా పిలవడం మానేస్తుంది. రేవంత్‌రమ్మంటే తప్ప మేం రామని సీనియర్లు రామని మొండికేస్తారు…ఆయన పిలువడు..సీనియర్లు అటు వైపు వెళ్లరు..ఇంకేముంది ఖేల్‌ ఖతం…సీనియర్ల రాజకీయం ఆగం…ఇలాగే మరో నాలుగు రోజులు గడిస్తే చాలు తాము నాయకులమన్న సంగతే మర్చిపోతారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు విలువ లేదని తిట్టుకుంటూ కాలం గడిపేస్తుంటారు..అయితే రాజకీయాలు వదలుకోలేని వాళ్లు మాత్రం కొత్త దారులు వెతుక్కుంటారు… అవసాన దశలో ఏదో ఒక పదవి దక్కితే చాలు…ఆ తర్వాత సంగతి దేవుడెరుగు అని ఏదో ఒక పార్టీలో చేరి, కొంత కాలం పొద్దుబుచ్చుకుంటారు….జ్ఞాపకాల పందిరిని మీడియాకు పదే పదే గుర్తు చేసుకుంటారు…

 అయితే రేవంత్‌ టార్గెట్‌ చేస్తున్న నాయకులంతా బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నది బాగా గమనిస్తే అర్ధమౌతుంది. 

 మూడుదశాబ్దాల పాటు తిరుగులేని నాయకులుగా చెలామాణి అయిన బిసి, ఎస్సీ నాయకులను రేవంత్‌ పార్టీనుంచి పంపే కార్యక్రమం మొదలుపెటినట్లున్నారని టాక్‌…! అదే రెడ్డి నేతలు అలిగితే వారి దగ్గరకు వెళ్తున్నాడు..వారిని భుజ్జగిస్తున్నాడు…ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. జగ్గారెడ్డి ఎన్ని సార్లు ఎన్ని మాటలు అన్నా, వాటినిపెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆయనుకు ఎదురెళ్లి మరీ పలకరించే రాజకీయాలుచేశాడు… ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి చెప్పాల్సిన పనిలేదు. అసలు రేవంత్‌రెడ్డిని సొంత పార్టీనేతైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టినన్ని తిట్లు ఎవరూతిట్టలేదు…అయినా మా వెంకన్న అంటూ దగ్గరకు వెళ్తూనే వుంటాడు..ఆయనకు క్షమాపణ చెబుతూనే వుంటాడు…పిలుపులు బాగనే వుంటాయి… కాని ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల నాడు దామోదర రాజనర్సింహ,పొన్నాల తోపాటు మరికొందరు నేతలు ధర్నా చేస్తే కనీసం అటు వైపు కూడా రేవంత్‌రెడ్డి చూడలేదు. ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏఐసిసి ఎన్నికల ఓట్ల విషయంలో పిసిసికి సంబంధం లేదని చెప్పిన రేవంత్‌ రెడ్డి, తమ ప్రమేయం లేదన్న మాట వారి వద్దకు వచ్చి చెప్పొచ్చు. కాని ఆ పని చేయలేదు. అంటే ఇదంతా జరగాలనే చేసినట్లు కనిపిస్తోంది. పోతే పోనీ అంటూ గాంధీ భవన్‌ సాక్షిగా సీనియర్లను,కో వర్టులకు హెచ్చరికలు జారీ చేసిన రేవంత్‌ తన కార్యాచరణ మొదలుపెట్టారు. సీనియర్లను ఒక్కొక్కరినీ సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లున్నారు. కార్చాచరణ అమలు చేస్తున్నాడు. కాకపోతే తెలంగాణ కోసం కృషి చేసిన సీనియర్లకు విలువివ్వాల్సిన అసవరం వుంది. ఆది విస్మరిస్తే పార్టీకి మరింత నష్టం జరగొచ్చు. నిజంగా రేవంత్‌ నాయకత్వానికే అంత శక్తి వుంటే ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓడియే వారు కాదు. గతం కన్నా మంచి మెజార్టీతో గెలిచేవారు. అక్కడ ఓడిపోయినా నోరున్న నేతగా వున్న గుర్తింపుతోపాటు, చంద్రబాబు నాయుడు రాజకీయం మూలంగా మల్కాజిగిరి పార్లమెంటు సీటు ఇచ్చారు…గెలిచారు..అంతే తప్ప రేవంత్‌ నాయకత్వంలో అద్భుతాలు ఊహించుకోవడం కూడా అత్యాశే అవుతుంది. హుజూరాబాద్‌లో గతంలో 60 వేల ఓట్ల నుంచి పార్టీకి ఒక్కసారిగా 3వేలకు పడిపోయినప్పుడే రేవంత్‌ రాజకీయం తన కోసమే పనికొస్తుంది తప్ప, ఏ పార్టీలో వున్నా, దానికి పనికి రాదని తేలిపోయింది. ఇక మునుగోడు ఏం చెప్పబోతోందో కూడా అందరికీ అర్ధమౌతూనే వుంది…అంటున్నారు సీనియర్లు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!