ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 23కొత్త జిల్లాలు, పెద్ద సంఖ్యలో మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగింది:ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్,వరంగల్ లకు ధీటుగా ఖమ్మం అభివృద్ధి జరుగుతున్నది:ఎంపీ రవిచంద్ర
ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తరు:ఎంపీ వద్దిరాజు
మున్నేరు నదిపై తీగల వంతెనను మంజూరు చేయాల్సిందిగా కేసీఆర్ ను కోరుత:ఎంపీ రవిచంద్ర
రఘునాథ పాలెంలో తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన
మంత్రి పువ్వాడ,లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి పాల్గొన్న ఎంపీ రవిచంద్ర
తహశీల్దార్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు తన ఎంపీ నిధుల నుంచి 25లక్షలు మంజూరు చేసిన రవిచంద్ర
అతిథులకు కోలాటం,మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన స్థానికులు
రఘునాథ పాలెం: ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 23జిల్లాలతో పాటు పెద్ద సంఖ్యలో మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందిందని,ఇంకా ముందుకు సాగుతుందన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండల కేంద్రంలో సోమవారం తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రవిచంద్ర మాట్లాడుతూ,మన పట్టణాలు,పల్లెల పురోభివృద్ధికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అవార్డులు వచ్చాయన్నారు.ఇదే కోవలో ఖమ్మం నగరం,పరిసర ప్రాంతాలు హైదరాబాద్, వరంగల్ లకు ధీటుగా అభివృద్ధి అవుతున్నదని వద్దిరాజు వివరించారు.కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు.అలాగే, ఖమ్మం నగరంలో కొత్త ఫ్లైఓవర్, మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జిలను మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు.రఘునాథ పాలెంలో శంకుస్థాపన జరిగిన తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు తన ఎంపీ నిధుల నుంచి 25లక్షలు మంజూరు చేస్తున్నట్లు రవిచంద్ర ప్రకటించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు వద్దిరాజును సభికుల హర్షామోదాల మధ్య ఘనంగా సత్కరించారు.కార్యక్రమానికి వందలాది మంది మహిళలు, యువకులు, స్థానికులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానికులు అతిథులకు కోలాటం,మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ ఛైర్మన్ శేషగిరిరావు, జాయింట్ కలెక్టర్ మధుసూదన్,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, ఆర్డీవో రవీంద్రనాథ్, జడ్పీటీసీ ప్రియాంక,ఎంపిపి గౌరి తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.