
బిటి రోడ్డు మంజూరి పట్ల సంబరాలు
దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని గోపాలపురం నుండి గొల్లపల్లె గ్రామం వరకు 1 కోటి 20 లక్షలతో బీటీ రోడ్డును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంజూరు చేయించారు.కాగా బుదవారం బీఅర్ఎస్ పార్టీ గోపాలపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గొల్లపల్లి సర్పంచ్ నీలం పైడయ్య అధ్యక్షతన
సీఎం కేసీఆర్, నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఏండ్ల తరబడి గత పాలకులు శిలాఫలకాలు వేసి రోడ్డు నిర్మాణ చేయలేదు కాగా ఎమ్మెల్యే సహకారంతో పనులు మొదలుపెట్టడంతో ఈసందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు సుకినె రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు వంగెటి అశోక్ కుమార్, ముప్పారపు ఎర్రయ్య, మండల నాయకులు లాండె రమేష్, మాజీ సర్పంచ్ లు లాండె శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, నీలం రాజు, తిమ్మాపురం శ్రీనివాస్, భాషబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.