తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులైన నాంపెల్లి కవిత బాలరాజు 29000, అస్మ బేగం ఫజల్ 18500, బండి దేవదాస్ రామయ్య 18000, జే మల్లేశం నారాయణ 20000, పెద్ది దేవేంద్ర ఎల్లయ్య 7000, వి శైలజ తండ్రి తిరుపతి 20000, చెక్కులను సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్నలింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, తెరాస నాయకుడు బుస్సలింగం, గుర్రం కిషన్ గౌడ్, తంగళ్లపల్లి శ్రీనివాస్, అమరగొండ ప్రశాంత్, చేతుల మీదిగా అందజేయడం జరిగింది.