పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలలో గుణాత్మక మైన మార్పులు…
పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం కోసం మెడికల్ కళాశాల
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలలో గుణాత్మక మైన మార్పులు వస్తున్నాయని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి
చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 30 వడివిజన్ లో నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంబించారు. అనంతరం సీతా నగర్ లో లో పర్యటించారు. వార్డు జనసభలో ఆయన మాట్లాడుతూ….ఆయా డివిజన్లో సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ప్రజలను చైతన్య పరిచి, వారిని
భాగస్వాములను చేసి ప్రతి వార్డు తద్వారా ప్రతి ఊరును బాగు చేయడమే పట్టణ ప్రగతి ముఖ్యోద్దేశ్యమని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారులుగా వుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దాదాపుగా ప్రతి ఇంటికి అందుతున్నాయని అన్నారు. రామగుండం నగరం పారిశ్రామిక ప్రాంతం కావడంతో
కాలుష్యం ఎక్కువగా వుండి ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారని , వారికి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఇక్కట్లు పడుతున్నారని తాను ముఖ్యమంత్రి కె సి ఆర్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించి సూపర్ స్పెషాలిటీ వసతులతో పెద్ద ఆసుపత్రి , మెడికల్ కళాశాల మంజూరు చేశారని అన్నారు. ప్రజలు కూడా చైతన్య వంతులై శ్రమ దానంతో తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమీషన్ సుమన్ రావు పదవ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య , కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ నాయకులు తానిపర్తి గోపాలరావు మండ రమేష్ , దుండు మల్లేష్ , దుర్గా , చింతల సతీష్ , కరుణాకర్ , సత్యం , తిరుపతి తదితరులు పాల్గొన్నారు.