సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున మన ఊరు మన బడి కార్యక్రమం స్పష్టికర్త జనగామ ముద్దు బిడ్డ తిమ్మయ్య సుభాష్ రెడ్డి* జన్మదిన వేడుకలను మిట్టపల్లి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అని మండలి వ్యవస్థపాక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ తెలిపారు, వారు మాట్లాడుతు ప్రజా సేవ చేయడం లో అన్ని వర్గాల వారిని ఆదుకొని గొప్ప మనసు వున్నా వ్యక్తి అని, తన స్వంత లాభం కోసం ఆలోచన చేయకుండా సుమారు 6 కోట్లతో పాఠశాలను కళాశాల ను కట్టించి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం కి అధ్యుడు అయినారు అని.ఈ సందర్బంగా సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. . ఈ కార్యక్రమం లో ఆసుపత్రి డాక్టర్, స్టాఫ్ నర్స్ సునీత,విజయ కుమారి,టేకుమట్ల మండలం ఎంపిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు సంగి రవి, మిట్టపల్లి మిత్ర మండలి సభ్యులు అందె కుమార్, సంపత్,తిరుపతి, పాల శంకర్, కనకం తిరుపతి,కిరణ్,గురుకుంట్ల కిరణ్ ఆకుల రాజు, శశి కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!