సిద్దిపేట నేటి ధాత్రి
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నూతనంగా జిల్లా కలెక్టర్ గా నిర్మించబడిన ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస రెడ్డిలు పుష్ప గుచ్చం అందించి వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ భాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లా అభివృద్ధిని పరిశీలించేందుకు ఈ జిల్లాకు ఇతర జిల్లా కలెక్టర్ గా రావడం జరిగింది అని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే సిద్దిపేట జిల్లాకు జిల్లా కలెక్టర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లు జిల్లా అభివృద్ధి చేస్తున్న కృషిలో భాగస్వామినై వారి సహకారంతో అన్ని ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు ప్రజలకు అందించడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందు ఉంచుతానని అన్నారు. గత కలెక్టర్లు జిల్లా అభివృద్ధికి చేపట్టిన పనులను కొనసాగిస్తానని, గత మూడు సంవత్సరాలుగా జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా విధులు నిర్వహిస్తున్న ముజామిల్ ఖాన్ సేవలను సద్వినియోగం చేసుకుంటామని, త్వరలోనే అధికారులతో సమావేశాలు నిర్వహించి వివిధ పనులు, పథకాల పురోగతిని సమీక్షిస్తానన్నారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనుల ప్రగతి పై రెండు, మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో పచ్చదనం, పరిశుభ్రతలో జరిగిన అభివృద్ధిని, సిద్దిపేట గజ్వేల్ పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఆదర్శంగా నిలిచాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.