సిఎం చెప్పిందే నిజమైంది!

 

బిజెపి నేతల వ్యాఖ్యల దుమారం చేటు తెచ్చిందా?

గల్ఫ్ దేశాల అగ్రహాం మొదలైందా?

ఇది బుద్ది జీవుల దేశం….

మతపిచ్చి, మతోన్మాదం మంచిది కాదు…

చిన్న పొరపాటు జరిగినా వందేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది?

గత కొంత కాలంగా కేసిఆర్ ఇదే చెబుతున్నారు?

అందుకే దేశంలో అధికార మార్పు జరగాలంటున్నారు?

ప్రజల్లో వస్తున్న మార్పు కేసిఆర్ వేస్తున్న అడుగుల వైపు…

సామ్యవాద, లౌకిక లక్ష్యాలే మనల్ని కాపాడేది

అందుకే కేసిఆర్ మేధావి లోకం మాట్లాడాలన్నారు…

మంచి ఎంత మంచిగా చెప్పినా కొన్ని ఎవరూ వినరు. వినదనెవ్వరు చెప్పినా, విననంతనే వేగిరపడ, వివరింపంగన్…అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి. అందులోనూ తెలంగాణ కార్యశీలి, కర్మశీలి, ఆచరణవాది, ప్రగతి దారి, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి వారు చెప్పినప్పుడైనా ఆలోచించాలి. కనీసం ఎందుకు చెబుతున్నాడా! అన్నదైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బిజెపి వ్యవహారం మూలంగా భవిష్యత్తు కుదేలయ్యా అవకాశం వుందని ఊహించారు. ఎంతో రాజనీతిజ్ఞుతతో , ముందు చూపుతో, దేశంలో గుణాత్మక మైన మార్పు కావాలని సూచించారు. అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనలను బిజెపి పెడచెవిన పెట్టింది. కర్ణాటక లాంటి సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన ప్రాంతాలలో మతపరమైన అలజడులు వద్దని భుజ్జగించింత సుతిమెత్తగా కూడా కేసిఆర్ హితవు పలికారు. అయినా వినలేదు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు మతపరమైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం అలవాటు చేసుకున్నారు. అవే ఓటు బ్యాంకుగా మారుతున్నాయన్న భ్రమలు పెట్టుకున్నారు. ఇప్పడవి ఆశనిపాతమైనట్లు తెలుసుకుంటున్నారు. 

 తెలంగాణ రాష్ట్ర సాధన తన జీవిత లక్యంగా సాగిన నేత.‌ తెలంగాణ కోసం ఓ వైపు నిర్విరామ పోరాటం చేస్తూనే, మరో వైపు తెలంగాణ ప్రగతి దారుల గురించి కలలున్నారు. ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నారు. అసలు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత త్వరితగతిన వేగవంతమైన అభివృద్ధి కనబర్చిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడుతోంది. అయితే దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాల పాత్ర, కేంద్ర పాలక పక్షం ఏక పక్ష ప్రవర్తన గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

 

కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చాక బిజెపి పార్టీ చేస్తున్న శృతిమించిన చేష్టలు దేశానికి ఇబ్బంది కరమంటూ చెబుతూనే వున్నారు. పెరుగుతున్న ధరలు, దెబ్బ తింటున్న అంతర్జాతీయ సంబంధాలపై కేంద్రం తీరును తప్పుపడుతూనే వున్నారు. నిత్యం బిజెపి మత సంబంధమైన వాదనలపై కేసిఆర్ అగ్రహాం కూడా వ్యక్తం చేశారు. మానిన గాయాలను రేపి రాజకీయం చేయడం, కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రచారం వంటి వాటిపై నిప్పులు చెరిగారు. చైనా మనదేశంలోకి చొచ్చుకొని వస్తున్న విషయం, అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా గ్రామాల నిర్మాణం వంటి విషయాలపై బిజెపిని నిలదీశారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా బిజెపి నేతలు నిందించే దాకా వచ్చారు.‌ ముఖ్యమంత్రి కేసిఆర్ క్షమాపణ చెప్పాలని నానా యాగీ చేశారు. అయినా ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా కేంద్రం తప్పులను ఎత్తిచూపుతూనే వచ్చారు…కేంద్రాన్ని తూర్పారపడుతూనే వచ్చారు…

 

ఇప్పుడు అదే నిజమైంది. బిజెపి నేతలు నోటికి అడ్డూ అదుపు లేకుండా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో చర్చకు దారి తీశాయి. బిజెపి అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు రేపిన దుమారం వల్ల అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చకు ఎవరు బాధ్యత వహిస్తారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ విస్పష్టమైన భవిష్యత్తు ఉత్పాతం వివరించారు. ప్రపంచంలో 59 ఇస్లామిక్ దేశాలున్నాయి. మన దేశమంటే ఆయా దేశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. అంతే కాకుండా ప్రపంచ దేశాలలో మన దేశ ప్రజలు సుమారు 13 కోట్ల మంది ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ మంచి జీవితాలు అనుభవిస్తున్నారు.

ఒకానొక దశలో మన దేశ ఆర్థిక ప్రగతి మందగమనంలో వున్నప్పుడు, విదేశాలలో వున్న మన వారి మారకంతో బైట పడిన సందర్భాన్ని ఆర్థిక వేత్తలు ప్రస్తావిస్తుంటారు. అంతే కాదు 1980వ దశకం వరకు మన దేశ వృద్ధి రేటు జిడిపి కన్నా ఎంతో తక్కువ వున్న చైనా ప్రపంచంలో దూసుకుపోతోంది. అలా ప్రగతి లో పోటీ పడాల్సిన సమయంలో, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా, అభివృద్ధి చెందిన దేశం కావాలంటే అందరికీ పని దొరకాలి. అన్ని రంగాలలో విసృతమైన పురోగతి కావాలి. పెట్టుబడులు రావాలి. మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు క్యూ కట్టాలి. మన యువతకు పని కల్పించాలి. నూతన ఆవిష్కరణలు జరగాలి. టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించాలి. పెట్టుబడులు వెల్లువలా రావాలి.

 

 1956 లో ఎల్ఐసి ప్రైవేటు రంగంలో వుంటే, దానిని నాటి ప్రధాని నెహ్రూ జాతీయం చేశారు. దానిని దేశ సంపదగా మార్చారు. మరి బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది. విదేశీ పెట్టుబడులు లేకుండా, మన సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ, మతపరమైన వివాదాలు రేపుతున్నారు. ప్రపంచ దేశాలలో వున్న మనవారి పట్ల అలాంటి ద్వేషభావాన్ని వ్యక్తం చేస్తే, వాళ్లంతా తిరిగి వస్తే వారికి ఉపాధి కల్పించగలమా? గత కొంత కాలం గా ముఖ్యమంత్రి కేసిఆర్ సూటిగా, స్పష్టంగా చెబుతూనే వస్తున్నారు. భవిష్యత్తులో ఇది జరిగే ప్రమాదముంది అంటూ హెచ్చరిస్తూనే వున్నారు. విదేశీ దౌత్యపరమైన సంబంధాలకు ఇబ్బంది కరమైన పరిస్థితులు తీసుకురావొద్దన్నారు. కానీ బిజెపి నేతలు అన్నంత పని చేశారు. కేసిఆర్ లాంటి వారి మాటలు పెడచెవిన పెడుతూనే వస్తున్నారు…

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అల్లర్లు చలరేగినా, కనీసం ఆహారం అందని కాలమది…అయినా నాడు అభివృద్ధి మీదే దృష్టి పెట్టారే తప్ప, ఈ వివాదాలకు చోటివ్వలేదు. గత ఎన్నికల ముందు నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతున్నది ఒకటే మాట. అభివృద్ధి వృద్ధి అంటే మతం కాదు…మనం మనం మనుషులమన్న భావన పెంపొందించుకోవడం…ఒకరినొకరు గౌరవించుకోవడం…ఒకరి మేలు మరొకరు కోరుకోవడం, ఒకరికొకరయ తోడుగా వుండడం. వీటికి మతం అడ్డు రావొద్దు. కులం గోడ కట్టొద్దు. కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో మన దేశం వుంది. రెండు వందల ఏళ్లపాటు ఆంగ్లేయులు ‌పాలనలో వుంది. అయినా హిందూ అన్నది ఒక ప్రవాహం… అది మతమా? అభిమతమో గాని కొనసాగుతూనే వుంటుంది. సనాతన ధర్మం ఈ ప్రపంచం వున్నంత కాలం వుంటుంది.

 

 హిందూ అనే పదానికి సృష్టి తప్ప నాశనం లేదు. అది అంతమయ్యేది కాదు…ఒకదగ్గర ఆగిపోయేది కాదు…ఎవరో పెంచిపోషిస్తేనే పెరిగేది కాదు..దాని విసృతిని ఎవరూ అడ్డుకోలేరు…ఇది చరిత్ర చెప్పిన నిజం. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలే ఏలుతున్న ప్రభుత్వం. ఇంకా ఎందుకు అభద్రతా భావం. 

 

 

 మనదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే 1323 లో పిచ్చి తుక్లక్ మూలంగా డిల్లీ సుల్తానుల చేతిలోకి వెళ్లి పోయింది. ఆ తర్వాత బహమనీ సుల్తానులు పాలించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీ లు, వారి తర్వాత మొగలుల ప్రత్యక్ష పాలన, ఆపై అసఫ్ జాహీలు…పాలించారు. కానీ తెలంగాణ లో ఎనభై శాతం అప్పటికీ, ఇప్పటికీ హిందువులే వున్నారు. నిజాం కాలంలో రజాకార్ల నాయకుడు కాశిం రజ్వి తబ్లిక్ పేరుతో మత మార్పిడులకు పాల్పడ్డాడు. ఒత్తిడి తెచ్చాడు. హింసించాడు. అల్లకల్లోలం చేశాడు. కానీ వారి కోరిక నెరవేరిందా? అంజుమన్ లాంటి సంస్థ మత పరమైన సభలు నిర్వహించింది. కానీ ఏం జరిగింది. హిందూ సమాజంలో మార్పు రాలేదు. పైగా తెలంగాణ లో కలరా వ్యాప్తి చెందిన సమయంలో ఓ సైనికుడు నిర్మాణం చేయించిన మహాకాళి గుడి నిర్మాణానికి నిజాం సహకరించాడు. 

 

మూడో నిజామైన సికిందర్ జా కాలం నుంచి ఇప్పటికీ నగరంలో బోనాల పండుగ అన్ని వర్గాల సహకారం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పీరిల పండుగ హిందూ ముస్లిం సఖ్యతను చూపిస్తోంది. ఆఖరు కుతుబ్‌షాహీ అయిన తానీషా కాలంలో భద్రాద్రి నిర్మాణం జరిగింది. అలాంటి వాతావరణం చెడగొట్టొద్దనేదే ముఖ్యమంత్రి కేసిఆర్ పదే, పదే చెబుతూవస్తున్నారు. అంతే కాదు ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ కూడా మసీదుల వివాదం వద్దన్నారు. అయినా గతంలో జరిగిన వాటికి ఇప్పటి సమాజానికి సంబంధం లేదు…నాటి తప్పులకు నేడు బాధ్యులెవరూ కాదు…రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగాలే గాని, పార్టీల రాజ్యాంగాలు కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!