
పోచమ్మ గుడి వద్ద బోనాల మొక్కులు చెల్లింపు..
మందమర్రి జియం మనోహర్..
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 14 ,నేటిదాత్రి:
మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని సమీపంలో గల సమ్మక్క సారలమ్మ జాతరను ఈనెల 21 నుండి ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. బుధవారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమీపంలో గల పోచమ్మ దేవాలయంలో జీఎం మనోహర్, యూనియన్ నాయకులు, పూజారి దూలం కనకయ్య లు మొక్కులు చెల్లించారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల భక్తులు జాతరకు విచ్చేసి జాతరను విజయవంతం చేయాలని మందమర్రి ఏరియా జిఎం మనోహర్ కోరారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం అన్ని సౌకర్యాలు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని భక్తులు, సింగరేణి కుటుంబ సభ్యులు సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె పి పరితల గని ఏజెంట్ గోవిందరావు, ఆర్కే వన్ గని మేనేజర్ జయంత్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ, మల్లేష్, అక్బర్ అలీ, సింగరేణి కార్మికులు ఉద్యోగులు భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.