*సాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల అనంతరం రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న రజకులు.*
*రేపు మహా ధర్నా కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి ,సాధన సమితి.*
*మహాదేవపూర్-నేటిథాత్రి:*
జమీందారు వ్యవస్థనుండి అమాయక ప్రజానీకానికి కాపాడటంలో క్రేశీలక పాత్ర పోషించి విజయం సాధించిన చిట్యాల ఐలమ్మ ప్రత్యేకంగా రజకుల హక్కులకై అనేక ఉద్యమాలు చేసి వారికి హక్కులను చేకూర్చే విధంగా చేసిన ప్రయత్నాలు అనేక ఉన్నాయి. జమీందారులపై వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ రజక సంఘమే కాకుండా ఒక సాయుధ పోరాట మహిళగా చాకలి ఐలమ్మ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళా పోరాట శక్తిగా ఒక ఒక ఉక్కు మహిళగా పేరు సంపాదించుకోవడం జరిగింది. జమీందారు వ్యవస్థనుండి ప్రజలకు విముక్తి కల్పించడంలో తమ ప్రాణాలను అర్పించిన చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకోగా భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో జిల్లా రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం రజక సంఘం నాయకులు రజకులు మండల కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు పాల్గొన్నారు.
*సాకలి ఐలమ్మ స్ఫూర్తితో డివిజన్ ను సాధించుకుంటాం.*
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహదేవ్పూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు పోరాడి తమ పాత తాలూకాను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసుకుంటామని రజక సంఘం జిల్లా నాయకులు అన్నారు. సాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం అనంతరం రజకులు మండల కేంద్రంలో 12వ రోజు కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రజకుల సంఘం జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు మాట్లాడుతూ మహదేవ్పూర్ మండలానికి కావాలని అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని తమ మండలాన్ని రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం ప్రకటించకపోతే ఉద్యమం మరింత తీవ్రత పరిమాణాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా రజకుల సంఘం జిల్లా నాయకులు చెన్నూరి వెంకటయ్య అన్నారు. అన్నది కాలం నుండి చరిత్ర కలిగిన మండలానికి ఇప్పటికీ అనేక డివిజన్ స్థాయి కార్యాలయాలు కొనసాగుతున్న క్రమంలో కుట్రలు కుతంతాలతో పలు కార్యాలయాలు విద్యాసంస్థలను ఇప్పటికే పక్క మండలానికి తరలించి మండలానికి అన్యాయం చేశారని అయినా మండల ప్రజలు ఏనాడు పల్లెత్తి మాట కూడా అనలేదని పక్క మండలం కూడా బాగుండాలని ఆలోచించిన ఘనత మండల ప్రజలదని అలాంటి ప్రజలను పదేపదే అభివృద్ధికి దూరం చేస్తూ అవమానిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తున్నారని రెవెన్యూ డివిజన్ కు కావలసిన సంపూర్ణ అర్హత ఉన్నప్పటికీ మహాదేవపూర్ మండలానికి వద్దని పక్క మండలం కాటారాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదించడం రజక సంఘం నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహదేవ్పూర్ మండలానికి రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా రజకుల సంఘం డిమాండ్ చేసింది.
*సాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల అనంతరం రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న రజకులు.*
38వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదివారం రోజున మండల కేంద్రంలో రజకుల సంఘం జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు పెద్ద మొత్తంలో రజకులు స్థానిక అమరవీరుల స్తూపం వద్ద చిట్యాల సాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రజకులందరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందులో 40 కుటుంబాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా బీసీ బందు రాలేదని రజకులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా సాకలి ఐలమ్మ విగ్రహానికి ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక జిల్లా నాయకులు చెన్నూరి వెంకటయ్య, కనుకుల మధునయ్య, దొడ్డిపట్ల మధు, దొడ్డిపట్ల శ్రీను ,దొడ్డిపట్ల సమ్మయ్య, వేములవాడ సారయ్య ,గుండ్ల పళ్ళు రాంబాబు, నస్పూరి సాయి,చంద్రగిరి రాజు, విలాసారపు రామ, తోపాటు పెద్ద మొత్తంలో రజకులు పాల్గొనడం జరిగింది.
*రేపు మహా ధర్నా కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి ,సాధన సమితి.*
మహాదేవపూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ గత 12 రోజులుగా జిల్లా కలెక్టర్ మరియు స్థానిక తహసీల్దారులకు కాటారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదించడానికి వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష తోపాటు పలు కుల సంఘాలు ప్రజల ఆధ్వర్యంలో వినతి పత్రాల కార్యక్రమం తో పాటు సోమవారం రోజున రెవెన్యూ డివిజన్ సాధన సమితి నిర్ణయం మేరకు మహాధర్నా కు సిద్ధం కావడం జరిగింది. సోమవారం జరిగే మహాధర్నా కార్యక్రమానికి మహదేపూర్ ఉమ్మడి మండలం లోని 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు మహిళలు యువకులు పెద్దలు వేదాదిగా తరలి రావాలని తమ మండలానికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే తమ మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మండల ప్రజలంతా ఐక్యమై మహా ధర్నా కార్యక్రమం చేపట్టి మహదేపూర్ మండల ప్రజల సత్తాను ప్రభుత్వానికి చూపెట్టాల్సిన అవసరం వచ్చిందని పార్టీలకు అతీతంగా మండలానికి రెవెన్యూ డివిజన్ సాధించుకోవడమే ఒక లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రెవెన్యూ డివిజన్ సాధించుకునే దిశగా మండల ప్రజలు అడుగు వేయాలని వేలాదిగా మండల ప్రజలు తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని మహదేవ్పూర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఉమ్మడి మండల ప్రజలకు కోరడం జరిగింది.