సర్పంచ్ జ్యోత్స్న బాయ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

ప్రజల ఆరోగ్యం కొరకే హెల్త్ క్యాంప్ సర్పంచ్

సీజన్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది మన బాధ్యత

డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రజలకు పలు సూచనలు చేసిన సర్పంచ్ జ్యోత్స్న బాయ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి:

అశ్వరావుపేట నియోజకవర్గం ఊట్లపల్లి గ్రామ పంచాయతీ గంగారం పాపిడి గూడెం గ్రామాల లో సీజనల్ వ్యాధులు రాకుండా హెల్త్ క్యాంప్ సర్పంచ్ జ్యోత్స్న బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీజన్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రపరచుకోవాలని అపరిశుభ్రమైన వాతావరణం వల్ల ఇండ్ల లోపల ,బయట నీరు నిల్వ ఉండడంవల్ల వాడి పారేసిన పాత సామాన్లు ,టైర్లు ,కూలర్లు ,పూల కుండీలు ఉండడంతో వ్యాధులు విజృంభిస్తాయని వాటర్ ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం మొదలైన వాటి వలన వ్యాధులు సంక్రమిస్తాయని ప్రతి ఒక్కరూ మన ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని వ్యాధులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఎవరికైనా ఇబ్బంది కలిగినచో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారించుకొని తగిన మందులు వాడుతూ డాక్టర్ల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వారు ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రక్త పరీక్షలు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్ల పల్లి సర్పంచ్ సాదు జోత్స్నా బాయ్ ఉపసర్పంచ్ సి హెచ్ ఓ సుప్రియ నర్సులు.ఆశ వర్కర్స్ వార్డ్ నెంబర్స్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!