
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…..
చెన్నారావుపేట-నేటిధాత్రి:
మండలంలోని పాపయ్యపేట గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ భర్త వెంకటేశ్వర్లు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.ఇట్టి విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకుని వెంకటేశ్వర్లు పార్దీవదేహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.అనంతరం మృతుని భార్య సర్పంచ్ లక్ష్మీ,కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వెంకటేశ్వర్లు బి.ఆర్.ఎస్.పార్టీ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు.సర్పంచ్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు.ఎమ్మెల్యే పంపించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ ముఖ్య నాయకులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.