సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 373 వ జయంతి

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపూర్ మండలం లోని బుదారావుపేట గ్రామంలో సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ 373జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు నారగోని పరమేష్ గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్టంలోసర్వాయిపాపన్న గౌడ్ పోరాట పటిమను నాయకులు గుర్తించలేదు.కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గౌడ సంఘాల ఐక్య ఉద్యమాలతో అణగారిన వర్గాల రాజ్య పాలకుడు తెలంగాణ రాష్టంలో 350 ఏళ్ల క్రితమే ఆత్మగౌరవ పోరాటంతో అన్ని కులాలను ఏకం చేసి తాల్లేక్కితే ఎమోస్తది కల్లమ్మితే ఎమోస్తది కొడితే గోల్కొండను కొట్టాలే రాజు గా రాజ్య పరిపాలన చేయాలే నా బహుజన జాతులు ఆత్మ గౌరవంతో బ్రతకాలే అని కత్తి పట్టి యుద్ధం చేసి 21 కోటలు ఆక్రమించుకొని బహుజనులకు రాజ్యకాంక్ష రుచి చూపించిన వీరోచిత పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులు చిర్రా క్రాంతి కుమార్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి వల్లపుదాసు తిరుపతి గౌడ్, కోశాధికారి మోడెం ఎల్లా గౌడ్, కారోబర్ మమునురి మహేష్ గౌడ్, కమిటీ నెంబర్స్ సుదగాని మురళి గౌడ్ బండి రాజు గౌడ్ బత్తిని కృష్ణగౌడ్ సోమగాని నరసయ్య గౌడ్ బత్తిని కేశవులు గౌడ్, గొల్లపల్లి వెంకన్న గౌడ్, గౌడ సంఘం కులస్తులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,గిరగాని నరసయ్య గౌడ్ ,బొమ్మగాని రాములు గౌడ్, దేశ గాని సతీష్ గౌడ్, ఆకుల రామచంద్రుగౌడ్ ,నారగోని యాదగిరి గౌడ్, పల్స సతీష్ గౌడ్, చిర్రా కుమారస్వామి గౌడ్,ఎరుకొండ సాంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *