పాఠశాలల బంద్ :ABVP తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహించనున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ *మన ఊరు-మన బడి* కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభమైనా కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేయకపోవడం,నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పనలో,మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడీ నియంత్రించి *ఫీజు నియంత్రణ చట్టం* అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం,ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థును విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన విద్యా శాఖ అధికారుల నియంత్రణ మాత్రం శూన్యం. సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరి నిరసిస్తూ ABVP తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో *july5* న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహిస్తుందని ఈ బంద్ కు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు మద్దతిచ్చి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*డిమాండ్స్*
*1* సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు,డ్రెస్ లు అందించాలి.
*2* ప్రభుత్వం ప్రకటించిన *మన ఊరు-మన బడి* కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.
*3* పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, DEO, MEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
*4* ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.
*5* ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి.
*6* ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.
*7* బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై కఠినంగా వ్యవహారించాలి.
*8* ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.
*9* విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.