
రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 14 ,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్ నేతత్వంలో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు, సహస్రనామార్చన, పంచామృతాభిషేకాలను వేదమంత్రోత్సరణ మధ్య అత్యంత వైభవంగా కనుల పండగగా నిర్వహించారు. వసంతం పంచమిని పురస్కరించుకొని ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ కటుకూరి వెంకటేష్-వనస్వి దంపతులు, ఆలయ ప్రచార కార్యదర్శి దండు సదానందం, కమిటీ సభ్యులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.