బి ఎస్ ఎస్ ఎం. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామ్యూల్
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన మట్టా రాఘమయి దయానంద్ ని ఈరోజు వారి ఇంటి దగ్గర మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది.
కలిసిన అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి రెవెన్యూ లో గల ప్రభుత్వ భూములపై గత ఐదు సంవత్సరాలుగా ఆదేశాలు ఉన్న జాప్యం చేస్తున్నారని, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు వెంటనే సర్వే చేసి అర్హత కలిగిన 500 మందికి కేటాయించాలని మెమొరాండం ఇవ్వడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కల్లూరు ఆర్డీవోకి, సత్తుపల్లి రేంజర్ తో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూరం మహేంద్ర, ఎడమ మహేష్, అశోక్, ప్రసాద్, గీగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.