వనపర్తి:-(నేటి ధాత్రి) వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఈ నెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘనాథం ,ఈ.వో.ఏస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 31 న శనివారం కదంబ నివేదన నుండి 12 వ తేది వరకు గోదా అమ్మవారి నిరాటోత్సవములు, 8 న ఆదివారం పోత్తి పాశురం, శ్రీ స్వామి వారికి మంగళహారతులతో 11న కూడారై ఉత్సవము,108 గంగాళములతో స్వామి వారికి పాయసం నివేదన 2న శ్రీ వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) ఉదయం 4:00గం నుండి గరుడ వాహన సేవా తదుపరి ఉత్తర ద్వారా పూజ ఉత్తర ద్వార దర్శన 14న ఉదయం 10 గంటల నుండి శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణోత్సవము 5 నా శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ స్వామి వారి నామార్చన ఉంటుందని వారు తెలిపారు . ఈ ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.