మంగపేట – నేటి ధాత్రి
మంగపేట మండలంలోని వాడగూడెం గ్రామానికి చెందిన తుమ్మల.వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా రాజుపేట లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల రోజువారి కూలీ పనికి వెల్లగా కాలికి దెబ్బ తగిలింది. గాయం తీవ్రం కావడంతో కాలు మొత్తం
ఇన్ఫెక్షన్ వచ్చింది ఆస్పత్రిలో చూపించే అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయడంతో సోమవారం వెంకటేశ్వర రావు ను కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయిల ఆర్థిక సహాయాన్ని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ అందజేశారు. అనంతరం తిమ్మంపేట గ్రామానికి చెందిన సున్నారీ నందిని, తన తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి పై చదువులు చదువుకోలేక నిస్సహాయ స్థితిలో ఉంది. తనను గూర్చి తెలుసుకొని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు కలిసి ఆమెకు స్టడీమెటీరియల్ నిమిత్తం రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నవీన్,ముయబోయిన శివ, జై భీమ్ రామ్ మోహన్, కొమరం నితిన్, గోమాసు సావిత్రి,ములుగు జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ శ్యాం బాబు, గ్రామస్తులు బొప్పెన జ్యోతి, నిమ్మగడ్డ ప్రవీణ్, బోడ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.