మహబూబాబాద్,నేటిధాత్రి:
శ్రమ దోపిడీకి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ ని జిల్లా కలెక్టర్ శశాంక కొనియాడారు.మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు సంఘాల నాయకుల తో నిర్వహించిన చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల రజక కులంలో పుట్టిన భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం శ్రమ దోపిడిని అరికట్టేందుకు 75 ఏళ్ల క్రితమే అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని ఆలోచించిన ధీరవనిత వీరనారి ఐలమ్మగా పేర్కొన్నారు.
ఈ పోరాటం వ్యవసాయ పోరాటానికి నాంది పలికిందన్నారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 800 యూనిట్స్ మంజూరు కాగా, అందులో 2001 యూనిట్స్ రజకులకు గ్రౌండ్ చేయటం జరిగిందని, లబ్ధిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పదం లో కొనసాగి,సాధికారత చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి రజక సంఘ నాయకులు గోపాల్, శ్రీనివాస్, పద్మ చంద్రయ్య గోపి బిక్షపతి వెంకన్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.