*ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి*
పొలిటికల్ ప్రతినిధి, నేటిధాత్రి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో ఫ్రీడమ్ రన్ ర్యాలీని ప్రారంభించిన వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్ళు
పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట ఉత్సవాలను ఘనంగా చేపట్టాలని నిశ్చయించింది. ఆగస్ట్ 8న ఈ వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా ఆగస్ట్ 22వరకు కొనసాగనున్నాయి. ప్రజల్లో దేశభక్తి పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలను ఈ పదిహేను రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం రన్ ర్యాలీని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు నాయకులు విద్యార్థులతో పాటు ప్రజలు భారీగా ఫ్రీడం రన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర పోరాట యోధులు స్పూర్తిని గుర్తచేస్తూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను భావి తరాలకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెరుపు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అబు ప్రకాష్ రెడ్డి. సర్పంచ్ లు కందగట్ల రవి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, బొమ్మకంటి సాంబయ్య, దుంపల శ్రీలతమహేందర్ రెడ్డి, పొడిమేకల మమతసంపత్, వనమ్మవీరస్వామి, మాజీ ఎంపీపీ, శాయంపేట ఎంపీటీసీ బాసని చంద్రప్రకాష్, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మారేపల్లి నందం, డబ్ల్యూహెచ్ఆర్సి పరకాల జనరల్ సెక్రెటరీ మేరగుత్తి కర్ణాకర్, అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.