విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యునికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందజేసిన నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం

నెల్లూరు రూరల్, బీవి నగర్ కి చెందిన కార్పెంటర్ గా పనిచేస్తున్న పేద కార్మికుడు రెండు రోజులు ముందు పొంగూరు గణేష్ కుమార్ కి బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది.యాక్సిడెంట్ కారణంగా గణేష్ కుమార్ కి ఆర్థిక స్తోమత లేనందున ఆపరేషన్ ఖర్చులకు వారి కుటంబసభ్యులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి ని వైద్య కోసం ఆర్థిక సహాయం అడిగారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా అధ్యక్షులు,ముత్తుకూరు మండలం అధ్యక్షులు,వారి కమిటీ కలిసి వైద్య ఖర్చులకు గాను రూ 7,500/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా పొంగూరు గణేష్ కుమార్ మాట్లాడుతూ…. మా సమస్యని తెలియజేసిన వెంటనే స్పందించి హాస్పిటల్ కి మంగళవారం రోజు వచ్చి పరిశీలించి,డాక్టర్లు,వైద్య సిబ్బందితో నెల్లూరు జిల్లా అధ్యక్షులుకి,ముత్తుకూరు అధ్యక్షులు పేరంబాకు మల్లికార్జున చారి,రాయ వేలూరు భాస్కర్ ఆచారి,మహేష్ ఆచారి,ఈపూరు ప్రసాద్ ఆచారి,తదితరులకు మాట్లాడారు అని తెలిపారు. అలాగే ఆర్థికంగా ఆదుకుని,అండగా నిలబడిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు నెల్లూరు రూరల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొంగూరు వెంగయ్య ఆచారి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!